April 27, 2009

ఆరాధన

సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : SP బాలు , జానకి



అరె ఏమైందీ
అరె ఏమైందీ.....ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ.....తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కల ఏదొ కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దురలేపింది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అరె ఏమైందీ..ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ



నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదూ పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో


అది దోచావో....ఓ ఓ ఓ ఓ

బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు


మనిషౌతాడు

అరె ఏమైందీ..ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కల ఏదొ కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దురలేపింది


అరె ఏమైందీ..ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ


**************************************************


సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : SP బాలు ,జానకి


తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మొమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా


తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మొమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా


తెలిసీ తెలియందా ....ఇది తెలియక జరిగిందా
ఎపుడొ జరిగిందా ...అది ఇపుడే తెలిసిందా
ఆశ పడ్డా అందుతుందా....అర్హతైనా ఉందా
అందుకున్నా పొంది కుందా ..పొత్తు కుదిరేదా
ప్రేమ కన్నా పాశం ఉందా..పెంచుకుంటే దోషం ఉందా
పెంచుకుంటే తీరుతుందా...పంచుకుంటే మరుపేదా



కలలో మెదిలిందా ..ఇది కధ లో చదివిందా
మెరుపై మెరిసిందా ...అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా ..తప్పు నీదౌనా
మారమంటే మారుతుందా...మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా...చేరుకునే దారి ఉందా
చేరుకునే చేయి ఉందా... చేయి చేయి కలిసేనా


తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మొమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా

No comments: