April 23, 2009

లక్ష్మి

సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : విశ్వ
గానం : రమణ గోగుల, గంగ

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

హే.. ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
తప్పదు నెగ్గే లేత జవాని..నచ్చాయే నీలో హొయలన్నీ..

నిన్నే నేనే మెచ్చా వాలా..
వినుకోరా హిమ్మత్ వాలా..మెప్పిస్తా అల్లేసియ్యాలా..

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

ఆటే కట్టు నీ బెట్టు కౌగిళ్ళకు తాకట్టు
చాటూ మాటు నీ గుట్టు వొద్దికలో చూపెట్టు
చేస్తూ చిలిపి ఆగడం .. వేస్తా కళ్ళతో శరం
తెస్తా నీలో కలకలం ..దేఖోనా !

హయ్యో కలికి కోమలం .. ఆపై చిలిపి యవ్వనం
దాచేదెట్టా సోకంతా..నాలోనా..లోలోనా !!

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

దేఖో దేఖో నీకేలే నా సోకుల యావత్తూ
రేపో మాపో అంటూనే దాటేయ్యకు నీ వొట్టు
చూసా తమరి వాలకం .. చేసా తుదకు సాహసం
నన్నే చేసుకో వశం .. దీవానా !

ఇట్టా తనువు తగలడం .. ఆపై మనసు రగలడం
చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా !

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

హే.. ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
తప్పదు నెగ్గే లేత జవాని..నచ్చాయే నీలో హొయలన్నీ..

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

*****************************************

సాహిత్యం : శంకర్ మహదేవన్, సుధ
గానం : చంద్రబోస్

హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా
హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
ముడేస్తాను మురళీలోలా..పడేస్తాను నా పాలా..

హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..నీ బోయ్ ఫ్రెండు నేనేగా
హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా

సే సే సత్యభామ..యో.. హుం
ఓసోస్ .. షకలక షకల అలకభామ..యే..చెక్ ఇట్ అవుట్ !

తూహీ మేరా దిల్ మేరా మన్ ఓ జానేమన్
తూహీ జీవన్ మేరే దిల్ కీ ధడకన్ !

ప్రతినిమిషం నీ వశం ఇదే సందేశం
ప్రణయరసం సమర్పిస్తా సమస్తం !

హిందీలో షేరేగాని..మన తెలుగులో కవితవనీ
ఏదైనా ఒకటే బాణీ..సయ్యాటకు సిద్దమనీ

హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా

మైహూ తేరే సాత్ మేరే యార్ మేరే సాథియా
తూహీ మేరా ప్యార్ ..యే వాదా హమేషా !

నువ్వే అనర్ధం అసాధ్యం మరీ అన్యాయం
నువ్వే అపాయం .. అందమైనా ఉపాయం !

నను పొగిడావా తిట్టావా..గిలిగింతలు పెట్టావా
నడిమధ్యన ఎందుకు గొడవ..నడిపిస్తా నీ పడవ

No comments: