December 29, 2008

వర్షం

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.చరణ్, సుమంగళి



మెల్లగా .. కరగనీ .. రెండు మనసుల దూరం
చల్లగా .. తెరవనీ .. కొంటె తలపుల ద్వారం


వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపీ తడిపీ తనతో నడిపీ హరివిల్లును వంతెన వేసిన శుభవేళా !


ఈ వర్షం సాక్షిగా .. తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా .. కలపనీ బంధం !


మెల్లగా .. కరగనీ .. రెండు మనసుల దూరం
చల్లగా .. తెరవనీ .. కొంటె తలపుల ద్వారం

నీ మెలికెలలోనా .. ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుముల లోనా .. నీ పిలుపును వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా


మతి చెడే .. దాహమై .. అనుసరించి వస్తున్నా
జతపడే .. స్నేహమై .. అనునయించనా


చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా !
ఈ వర్షం సాక్షిగా .. తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా .. కలపనీ బంధం !


ఏ తెరమరుగైనా .. ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరుచినుకైనా .. నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే ఋణపడిపోనా ఈ పైనా


త్వరపడే .. వయసునే .. నిలుపలేను ఇకపైనా
విడుదలే .. వద్దనే .. ముడులు వేయనా


మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా !

ఈ వర్షం సాక్షిగా .. తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా .. కలపనీ బంధం !

మెల్లగా .. కరగనీ .. రెండు మనసుల దూరం
చల్లగా .. తెరవనీ .. కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపీ తడిపీ తనతో నడిపీ హరివిల్లును వంతెన వేసిన శుభవేళా !


ఈ వర్షం సాక్షిగా .. తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా .. కలపనీ బంధం !


***********************************

గానం: టిప్పు, ఉష


హే లంగా వోణీ .. నేటితో రద్దైపోనీ .. డుం డుం డుం
సింగారాన్నీ .. చీరతో సిద్దం కానీ .. డుం డుం డుం
నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాయీ
చిందులే ఆపగా ముళ్ళు వెయ్యనీ



సర్లే కానీ .. చక్కగా పెళ్ళైపోనీ .. డుం డుం డుం
అల్లర్లన్నీ .. జంటలో చెల్లైపోనీ .. డుం డుం డుం
మెత్తనీ పగ్గమై పట్టుకో ప్రాయాన్నీ
సొంతమై అందమే అప్పగించనీ



హే లంగా వోణీ .. నేటితో రద్దైపోనీ .. డుం డుం డుం
సింగారాన్నీ .. చీరతో సిద్దం కానీ .. హ !


ఓ .. చూడు మరీ దారుణం .. ఈడునెలా ఆపడం
వెంటపడే శత్రువయే సొంత వయ్యారం
హే .. ఒంటరిగా సోయగం .. ఎందుకలా మోయడం
కళ్ళెదురే ఉందికదా ఇంత సహాయం


పుస్తే కట్టీ .. పుచ్చుకో కన్యాధనం
హె హె హే .. శిస్తే కట్టీ తీర్చుకో తియ్యని ఋణం

హే లంగా వోణీ .. నేటితో రద్దైపోనీ ..
సింగారాన్నీ .. చీరతో సిద్దం కానీ ..


హే సోకు మరీ సున్నితం .. దాన్ని ఎలా సాకటం
లేత నడుం తాళదు నా గాలి దుమారం
కస్సుమనే లక్షణం .. చూపనిదే తక్షణం
జాలిపడే లాలనతో లొంగదు భారం


హే ఇట్టే వచ్చీ అల్లుకో ఇచ్చేవిచ్చీ
ఆర్చే తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ


హాయ్ హాయ్ హాయ్ లంగా వోణీ .. నేటితో రద్దైపోనీ ..
సర్లే కానీ .. చక్కగా పెళ్ళైపోనీ ..
నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాయీ
చిందులే ఆపగా ముళ్ళు వెయ్యనీ

No comments: