December 23, 2008

ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి


గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ .. మగతావినీ .. ముడి వేయనీయవా
కాదనీ .. అనలేననీ .. గడి అయిన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
(హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ)

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !

(మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే భద్రామి శుభకే త్వం జీవ శరదస్యకం
త్వం జీవ శరదస్యకం .. త్వం జీవ శరదస్యకం !)

కాంక్షలో కైపు నిప్పూ .. ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా .. మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం .. గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం .. మరయాగ వాటికా

కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !

నిష్ఠగా నిన్ను కోరీ .. నీమమే దాటినా
కష్ఠమే సేద తీరే .. నేస్తమే నోచనా
నిద్రహం నీరు గారే .. జ్వాలలో నించినా
నేర్పుగా ఈది చేరే .. నిశ్చయం మెత్తనా

సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ .. మగతావినీ .. ముడి వేయనీయవా
కాదనీ .. అనలేననీ .. గడి అయిన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
(హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ)

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !


**************************************************

గానం: మనో, చిత్ర

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా

చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !

మెత్తగా వళ్ళో .. పెట్టుకో కాళ్ళూ
ఉందిగా అంక పీఠం .. ఆడపుట్టుకే అందుకోసం
గట్టిగా పట్టుకో .. భక్తిగా అద్దుకో
పుచ్చుకో పాద తీర్ధం .. పాద పూజలే ఆది పాఠం

చాకిరీ చెయ్యనా బానిసై .. నీ సేవలే చెయ్యనా పాదుషా
దీవెనే తీసుకో బాలికా .. నీ జీవితం సార్ధకం పొమ్మికా
మొక్కులే తీరీ .. అక్కునే చేరీ .. దక్కెనే సౌభాగ్యం

చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !

నచ్చెనే నారీ .. వచ్చెనే కోరీ ..
తెచ్చెనే ప్రేమ సౌఖ్యం .. సాటి లేనిదీ ఇంటి సఖ్యం
మెచ్చెనే చేరీ .. ముచ్చటే తీరీ
ఇచ్చెనే ప్రేమ రాజ్యం .. అంతులేనిదే సంతోషం

స్వప్నమే సత్యమై వచ్చెనేమో .. వెచ్చగా సర్వమూ పంచగా
స్వర్గమే సొంతమై దక్కెనేమో .. అచ్చటా ముచ్చటా తీర్చగా
మక్కువే మీరీ .. ముద్దులే కోరీ .. అందెనా ఇంద్రభోగం

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !


*******************************************

గానం: మనో, చిత్ర

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా (2)

నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

షోలే ఉందా ?
ఇదిగో ఇందా ..
చాల్లే ఇది జ్వాల కాదా..
తెలుగులో తీశారే బాలా !

ఖైదీ ఉందా?
ఇదిగో ఇందా..
ఖైదీ కన్నయ్య కాదే ..
వీడికి అన్నయ్య వాడే !

జగదేకవీరుడి కధా..ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల .. అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

ఒకటా రెండా .. పదులా వందా
బాకీ ఎగవేయకుండా .. బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా .. మతి పోయిందా
చాలే నీ కాకి గోలా .. వేళా పాళంటూ లేదా

ఏవైంది భాగ్యం కధా? కదిలిందా లేదా కధా?
వ్రతమేదో చేస్తుందంటా .. అందాక ఆగాలటా
సౌఖ్యంగా బ్రతకాలీ .. సౌఖ్యాలే పొందాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

No comments: