December 29, 2008

గమ్యం

సంగీతం: ఇ.ఎస్.మూర్తి, అనిల్.ఆర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుజాత



సమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకే


సమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకే


తీరం ఇలా తనకు తానే
తీరం ఇలా తనకు తానే ..వెతికి జతకి చేరే క్షణాలలో !


సమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకే



చంటిపాపలా .. అనుకుంటూ ఉండగానే
చందమామలా .. కనుగొన్నా గుండెలోనే
తనలో చిలిపితనం .. సిరివెన్నెలే అయేలా
ఇదుగో కలలవనం .. అని చూపుతున్న లీలలో

సమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకే



పైడిబొమ్మలా .. నను చూసే కళ్ళలోనే
ఆడజన్మలా .. నను గుర్తించాను నేనే
తనకే తెలియదనీ .. నడకంటే నేర్పుతూనే
నను నీ వెనక రానీ .. అని వేడుతున్న వేళలో



సమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకే (2)



********************************
గానం: రంజిత్


ఎంతవరకూ .. ఎందుకొరకూ .. వింతపరుగూ .. అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే .. బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే .. గుర్తుపట్టే గుండెనడుగూ



ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా !
తెలిస్తే ప్రతీ చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా !!


ఎంతవరకూ .. ఎందుకొరకూ .. వింతపరుగూ .. అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే .. బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే .. గుర్తుపట్టే గుండెనడుగూ



కనపడేవెన్నెన్ని కెరటాలూ .. కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరూ
మనకిలా ఎదురైన ప్రతివారూ .. మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూ



సరిగా చూస్తున్నదా .. నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో .. విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలీ .. వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్నూ మిన్నూ నీరూ అన్నీ కలిపితే నువ్వే కదా కాదా !



ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా !
తెలిస్తే ప్రతీ చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా !!


మనసులో నీవైన భావాలే .. బయటకనిపిస్తాయి దృశ్యాలై
నీడలూ నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే .. స్నేహితులు నీకున్న ఇష్ఠాలే
ఋతువులూ నీ భావ చిత్రాలే



ఎదురైన మందహాసం .. నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం .. నీ మకిలి మదికి భాష్యం
పుటకా చావూ .. రెండే రెండూ .. నీకవి సొంతం కావూ .. పోనీ
జీవితకాలం .. నీదే నేస్తం .. రంగులు ఏంవేస్తావో .. కానీ !

No comments: