సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: బాలు, పి.సుశీల
రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారీ
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో (2)
కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండుగేమో
చిననాటి స్నేహమే అందెనేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో (2)
ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో ..
ఎన్నెన్ని భావాలో !
రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారీ
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
చూసాను ఎన్నడో పరికిణీ లో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో (2)
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహం లో
ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో ..
ఎన్నెన్ని కౌగిళ్ళో !
రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారీ
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
No comments:
Post a Comment