సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: కె.జె.ఏసుదాస్
ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికీ .. మేఘసందేశం మేఘసందేశం
వానకారు కోయిలనై .. తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై .. తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని .. కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో .. ఉలిపిరి చినుకుల బాసలతో+
విన్నవించు నా చెలికీ .. విన్న వేదనా నా విరహ వేదనా
ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
రాలుపూల తేనియకై .. రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై .. రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో .. రుధిర భాష్పజల ధారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికీ .. మనోవేదనా నా మరణయాతనా
ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికీ .. మేఘసందేశం మేఘసందేశం
*****************************************
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల
ఆకులో ఆకునై .. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా (2)
గలగలనే వీచు చిరుగాలిలో కెరటమై
గలగలనే వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనే పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై .. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా !
***************************************
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని .. నీవు వచ్చు మధుర క్షణమేదో (2)
కాస్త ముందుతెలెసెనా ప్రభూ
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందరమందారకుంద సుమదళములు పరువనా
సుందరమంద అరకుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా .. చాలు !
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని .. నీవు వచ్చు మధుర క్షణమేదో
కాస్త ముందుతెలెసెనా ప్రభూ ...
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావూ
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావూ
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసమున నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసీ
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని .. నీవు వచ్చు మధుర క్షణమేదో
కాస్త ముందుతెలెసెనా ప్రభూ ...
**************************************
గానం: కె.జె.ఏసుదాస్
సిగలో .. అవి విరులో .. అగరు పొగలో అత్తరులో
మగువా సిగ్గు దొంతరలో .. మసలే వలపు తొలకరులో (2)
సిగలో .. అవి విరులో ..
ఎదుటా .. నా ఎదుటా ..ఏవో సోయగాల మాలికలూ
ఎదుటా .. నా ఎదుటా ..ఏవో సోయగాల మాలికలూ
మదిలోనా .. గదిలోనా
మదిలోనా .. గదిలోనా .. మత్తిల్లిన కొత్త కోరికలూ
నిలువనీవు నా తలపులూ .. మరీ మరీ
ప్రియా .. ప్రియా
నిలువనీవు నా తలపులూ .. నీ కనుల ఆ పిలుపులూ !
సిగలో .. అవి విరులో .. అగరు పొగలో అత్తరులో
మగువా సిగ్గు దొంతరలో .. మసలే వలపు తొలకరులో
సిగలో .. అవి విరులో ..
జరిగీ .. ఇటు ఒరిగీ .. పరవశాన ఇటులే కరిగీ
జరిగీ .. ఇటు ఒరిగీ .. పరవశాన ఇటులే కరిగీ
చిరునవ్వుల అర విడినా .. చిగురాకు పెదవుల మరిగీ
చిరునవ్వుల అర విడినా .. చిగురాకు పెదవుల మరిగీ
మరలిరాలేవు నా చూపులూ .. మరీ మరీ
ప్రియా .. ప్రియా
మరలిరాలేవు నా చూపులూ.. మధువుకై మెదలు తుమ్మెదలూ
సిగలో .. అవి విరులో .. అగరు పొగలో అత్తరులో
మగువా సిగ్గు దొంతరలో .. మసలే వలపు తొలకరులో
సిగలో .. అవి విరులో
****************************************
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ
సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మవ్వంపు నటనాల మాతంగినీ
కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరిమల్లినీ
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
1 comment:
Good selection and good collection.
Post a Comment