సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మా .. రగమేమో తీసినట్టు ఉందమ్మా
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మా .. రగమేమో తీసినట్టు ఉందమ్మా
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ ..మువ్వ గోపాలా
మువ్వ గోపాలా ..మువ్వ గోపాలా అన్నట్టుందమ్మా
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ .. రాతిరేల సంత నిదుర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ .. రాతిరేల సంత నిదుర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ ..
ముద్దుమురిపాలా .. మువ్వగోపాలా
నీవు రావేలా అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా .. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా .. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా
ముద్దుమురిపాల
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
మువ్వగోపాలా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
నీవు రావేలా
కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
పొంచి వింటున్నావా .. కృష్ణమ్మా
అన్ని మంచి వార్తలే కృష్ణమ్మా !
*******************************************
గానం: పి.సుశీల
మందార మకరంద మాధుర్యమునదేలు
మధుపంబు పోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకు
ఆ .. ఆ చింత నీకేలరా
ఆ చింత నీకేలరా
ఆ చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా
సొంతమైన నీ సొగసులేలక .. పంతమేల పూబంతి వేడగ
సొంతమైన నీ సొగసులేలక .. పంతమేల పూబంతి వేడగ
ఆ చింత నీకేలరా
సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్ని
కరిగించి కౌగిళ్ళ తినిపించగా
ఆ .. ఆ చింత నీకేలరా
నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా
ఆవంక ఆ వెన్నెలమ్మా .. ఈ వంక ఈ వన్నెలమ్మా
ఆవంక ఆ వెన్నెలమ్మా .. ఈ వంక ఈ వన్నెలమ్మా
ఏ వంక ఏమి నెలవంక నేనమ్మ .. నీకింక అలకెందుకమ్మా !
ప్చ్ ప్చ్ ప్చ్ .. అయ్యో !
లలిత రసాల పల్లవ కారియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర మరుగునే
సాంద్ర నిహారములకు .. వినుత గుణశీల మాటలు వేయునేలా
ఆ చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా
No comments:
Post a Comment