December 24, 2008

అంకురం (1992)

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, బాలు


ఎవరో ఒకరూ..
ఎపుడో అపుడూ..
ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపు

ఆ..ఆ..
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుక వచ్చు వాళ్ళకూ బాట అయినదీ

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

కదలరు ఎవ్వరూ..వేకువ వచ్చినా
అనుకొని కోడి కూత నిదురపోదుగా
జగతికి మేలులొల్పు మానుకోదుగా

మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగా నేల దారికీ
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ !

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

చెదరకపోదుగా చిక్కని చీకటీ
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికీ
దానికి లెక్క లేదు కాళరాతిరీ

పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్ప వెనక ఆపనీ కంటి నీటినీ
సాగలేక ఆగితే దారి కరుగునా
జాలి చూపి తీరమే దరికి చేరునా !!

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

యుగములు సాగినా..నింగికి తాకకా
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా

ఇంత వేడి ఎండతో వళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడూ కళ్ళూ మూయడా
నల్లమబ్బు కమ్మితే చల్లబారడా !!!

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ !

No comments: