సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తీక్, శ్వేత
చెలీ .. తొలి కలవరమేదో
ఇలా .. నను తరిమినదే
ప్రియా .. నీ తలపులజడిలో
ఇంతలా .. ముంచకే .. మరీ !
పొద్దున్నేమో ఓ సారీ ..
సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?
ముగ్గే పెడుతూ ఓ సారీ ..
ముస్తాబవుతూ ఓ సారీ ..
ఏదో అడగాలనిపిస్తోంది .. What shall I do?
కొత్తగా .. సరికొత్తగా .. చిరుగాలి పెడుతోంది కితకితా
ముద్దుగా .. ముప్పొద్దులా .. వయసుడిగిపోతుంది కుతకుతా
ఏమైనా ఈ హాయి తరి తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!
పొద్దున్నేమో ఓ సారీ ..
సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?
అతిధిగ వచ్చే నీకోసం స్వాగతమౌతానూ
చిరునవ్వుగ వచ్చే నీకోసం పెదవే అవుతానూ
చినుకై వచ్చే నీకోసం దోసిలినౌతానూ
చిలకై వచ్చే నీకోసం చెట్టే అవుతానూ
చాటుగా .. ఎద చాటుగా .. ఏం జరిగిపోతుందో ఏమిటో
అర్ధమే .. కానంతగా .. ఎన్నెన్ని పులకింతలో
తొలిప్రేమ కలిగాక అంతేనటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!
అలలా వచ్చే నీకోసం సెలయేరౌతానూ
అడుగై వచ్చే నీకోసం నడకే అవుతానూ
కలలా వచ్చే నీకోసం నిదురే అవుతానూ
చలిలా వచ్చే నీకోసం కౌగిలినౌతానూ
పూర్తిగా .. నీ ధ్యాసలో .. మది మునిగిపోతోంది ఎందుకో
పక్కనే .. నువ్వుండగా .. ఇంకెన్ని గిలిగింతలో
నాక్కూడా నీలాగే అవుతుందటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!
పొద్దున్నేమో ఓ సారీ ..
సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?
ముగ్గే పెడుతూ ఓ సారీ ..
ముస్తాబవుతూ ఓ సారీ ..
ఏదో అడగాలనిపిస్తోంది .. What shall I do?
కొత్తగా .. సరికొత్తగా .. చిరుగాలి పెడుతోంది కితకితా
ముద్దుగా .. ముప్పొద్దులా .. వయసుడిగిపోతుంది కుతకుతా
ఏమైనా ఈ హాయి తరి తరికిటా !
No comments:
Post a Comment