సంగీతం: హరిస్ జయరాజ్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: రఘు కుంచె, నాగ సాహితి
నీ తలపున..నీ తలపునా
నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే
కంటిపాపగ దాచెను హాయే
హ్మ్ .. నాలో రగిలే .. తీయని మంటా .. నేడెందుకనీ
హ్మ్ .. కోరికలన్నీ .. తారకలాయే .. ఏ విందుకనీ
నీ తలపున..నీ తలపునా
నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే
కంటిపాపగ దాచెను హాయే
ఒడిలో రేగు విరహం .. అది కోరెనే చిలిపి సరసం
తగనీ వలపు మోహం .. అది తగవే తీరు స్నేహం
తరగనిదీ .. కరగనిదీ .. వగలన్ని సెగలైన చలీ
తొలిముద్దు నన్నే .. బులిపించగానే .. దినం దినం నిన్నే చూడగా !
నీ తలపున..నీ తలపునా .. నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే .. కంటిపాపగ దాచెను హాయే
బుగ్గలా పాలమెరుపూ .. అది తగ్గలేదింత వరకూ
మోహం రేపు కలగా .. తొలి ఆమనే వచ్చె నాకై
రసికతలో .. కసికతలే .. తెలిపెను చిలిపిగ చెలీ
ముద్దు ముత్యాలన్నీ .. మోవి దిద్దగానే .. ఎగిసెను నాలో ప్రాయమే !
నీ తలపున..నీ తలపునా ..నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే ..కంటిపాపగ దాచెను హాయే
హ్మ్ .. నాలో రగిలే .. తీయని మంటా .. నేడెందుకనీ
హ్మ్ .. కోరికలన్నీ .. తారకలాయే .. ఏ విందుకనీ
***********************************
గానం: చిన్మయి, రఘు కుంచె
మేఘమాల తానే .. నీ చెంతకొచ్చిందీ
రాగమాలలేవో .. నీ కోసం తెచ్చిందీ
చల్లనీ మనసు .. ఇక నీదేనన్నదీ
మల్లెలా మాసం .. నీ మాటేనన్నదీ
నీ ఊర్వశిగా..
నీ ప్రేయసిగా ..
నీ ఊర్వశిగా..నీ ప్రేయసిగా ..
ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా
చిలికి చిలికీ కురిసే జల్లై .. నన్ను ముంచెయ్యవా
ఒంటరి గాయం చేసే ప్రాయం .. క్షణము లాలించవా
ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
ఎదనే తెలుపూ మాటలిలా .. ఎదుటే పడితే మౌనమయే
తొలుచు తలపు ఇదీ .. పిలుచు చిలక ఇదీ
ఊపిరి నీవై .. నాలోనా శ్వాసించవా
చూపులతోనే .. నను నువ్వే శాసించవా
ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా
కదలని కాలం బరువాయే .. కంటికి నిదురే కరువాయే
నీడను వీడి వెళ్తావా .. నీతోనే తీసుకెళ్తావా
జన్మల బంధం .. నీతోటి .. వేసెయ్యవా
కమ్మని కలలే .. ఇక నిజమూ .. చేసెయ్యవా
ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా
చిలికి చిలికీ కురిసే జల్లై .. నన్ను ముంచెయ్యవా
ఒంటరి గాయం చేసే ప్రాయం .. క్షణము లాలించవా
క్షణము లాలించవా .. క్షణము లాలించవా !
No comments:
Post a Comment