March 30, 2009

భగీరథ

సంగీతం : చక్రి
గానం : హరిహరన్, కౌసల్య



ఎవరో..ఎవరో..ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే..అమృతాల వరదై పారే


తన పేరే ప్రేమా..తనదే ఈ మహిమా
తనదే తొలి జన్మా..తరువాతే బ్రహ్మా


ఎవరో..ఎవరో..ఎదలో ఎవరో

చూపుల్లో పున్నమి రేఖలుగా..రూపం లో పుత్తడి రేఖలుగా
మారింది జీవన రేఖ నా హృదయం లో తానే చేరాకా


అధరాలే మన్మధ లేఖ రాయగా..
అడుగేమో లక్ష్మణ రేఖ దాటగా..


బిడియాలా బాటలో..నడిపే వారెవరో..
బడిలేనీ పాఠమే..నేర్పే తానెవరో..


విడిపోని..ముడివేసి..మురిసేదెవ్వరో..
ఎవరో..ఎవరో..


మల్లెలతో స్నానాలే పోసి..నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టీ.. నన్నే తానూ నీకై పంపిందీ !


సొగసంత సాగరమల్లే మారగా..
కవ్వింత కెరటాలల్లే పొంగగా..


సరసాలా..నావలో..చేరే వారెవరో
మధురాలా..లోతులో..ముంచే తానెవరో


పులకింత ముత్యాలే పంచేదెవరో..

ఎవరో..ఎవరో..ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే..అమృతాల వరదై పారే


తన పేరే ప్రేమా..తనదే ఈ మహిమా
తనదే తొలి జన్మా..తరువాతే బ్రహ్మా
ఎవరో..ఎవరో..ఎదలో ఎవరో

No comments: