March 02, 2009

సొమ్మొకడిది సోకొకడిది

సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి



తొలివలపూ..తొందరలూ
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను..చలితో నీవు..చేసే అల్లరులు


తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు..చలితో నేను..చేసే అల్లరులు


తొలివలపూ తొందరలు..ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు .. తొందరలు..ఉసిగొలిపే .. తెమ్మెరలు


పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు..కరగాలి కౌగిళ్ళలో
వలపించే వళ్ళు.. వలచే పరవళ్ళు.. కదిలే పొదరిళ్ళలో


తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు.. కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు.. బిగిసే సంకెళ్ళలో
నీలో అందాలు.. నేనే పొందాలు..నాకే చెందాలిలే


తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను..చలితో నీవు..చేసే అల్లరులు


తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపూ తొందరలు..ఉసిగొలిపే తెమ్మెరలు

కురిసే ఈ వాన.. తడిసే నాలోనా.. రేపిందిలే తపనా
పలికే పరువాన.. వలపే విరివాన .. నీవే ఆలాపనా


వణికే నీ మేన .. సణిగే నా వీణ .. పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు .. సిగలో నేనుంచనా


నీలో రాగాలు.. నాలో రేగాలి.. నేనే ఊగాలిలే

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు..చలితో నేను..చేసే అల్లరులు
తొలివలపూ తొందరలు..ఉసిగొలిపే తెమ్మెరలు


తొలివలపు .. తొందరలు..ఉసిగొలిపే .. తెమ్మెరలు
తొలివలపు .. తొందరలు..ఉసిగొలిపే .. తెమ్మెరలు

No comments: