March 06, 2009

నేస్తమా

సంగీతం: Joy Calwin
సాహిత్యం: సారపు సంతోష్ కుమార్
గానం: కార్తీక్, చిన్మయి



ఏ జన్మదో .. ఈ ఫలము
ఈ జన్మకే .. ఒక వరము
ఎదురైన .. అమృతము
కవ్వించే .. నవ్వించే .. లాలించే స్నేహమింక నీలో ఆనందం పొంగించే !


చరితలు చూడని వైనం
కన్నుల చేరిన స్వప్నం
వెన్నెల కూడిన తేజం ఇదాయే !


ఏడారి చేరిన చినుకై
గుండెకు సవ్వడిలాగా
నన్నే వీడని నేస్తం ..నీవాయే !


గాలి లోని పరిమళాలు గాలివా ..పూలవా ..
తోడుగా .. విచ్చెనే
నేల చేరు వాన చినుకు నేలదా.. నింగిదా..
నేలపై .. చేరెనే


పెదవిపై నవ్వు పూసింది
తానుగా విరియలేదంది
ఈ ఇంద్రజాలు నీవేలే


చరితలు చూడని వైనం
కన్నుల చేరిన స్వప్నం
వెన్నెల కూడిన తేజం ఇదాయే !


ఏడారి చేరిన చినుకై
గుండెకు సవ్వడిలాగా
నన్నే వీడని నేస్తం ..నీవాయే !


ఆకాశాన గాలిపటము ఎగిరెనా.. భారమై.. నీవుగా .. వచ్చెనే
నువ్వు లేక నేనే లేను స్నేహమా .. నిలిచిపో.. నీడగా .. హాయిగా


చెలిమితో చొరవ చేసావు
కలిమితో అలుపే తీర్చావు
సరిక్రొత్త నేస్తం నీవేలే


చరితలు చూడని వైనం
కన్నుల చేరిన స్వప్నం
వెన్నెల కూడిన తేజం ఇదాయే !


ఏడారి చేరిన చినుకై
గుండెకు సవ్వడిలాగా
నన్నే వీడని నేస్తం ..నీవాయే !


హో.. ఏ జన్మదో .. ఈ ఫలము
ఈ జన్మకే .. ఒక వరము
ఎదురైనా .. అమృతమూ
కవ్వించే .. నవ్వించే .. లాలించే స్నేహమింక నీలో .. ఆనందం పొంగించే !
చరితలు చూడని వైనం
కన్నుల చేరిన స్వప్నం
వెన్నెల కూడిన తేజం ఇదాయే !


ఏడారి చేరిన చినుకై
గుండెకు సవ్వడిలాగా
నన్నే వీడని నేస్తం ..నీవాయే !



*****************************************************
గానం: చిన్మయి

ఇవ్వాళ నాలో ఏమైంది..గుండెల్లో ఏదో మొదలైందీ
ఇవ్వాళ నాలో ఏమైంది..గుండెల్లో ఏదో మొదలైందీ


మనసునా..నిలిచినా..
అతని కదలికలేనా..తనువు తడిపినదేమో
కనులు మురిసినవేళా..అడుగు నిలవక రానా !


ఇవ్వాళ నాలో ఏమైంది..గుండెల్లో ఏదో మొదలైంది
కునుకు వీడి మది తుదకు నిన్నె జత పడుచు వయసు కోరే ప్రాణం
కలలో..ఇలలో..మెదిలే అలజడి నీదై
కునుకు వీడి మది తుదకు నిన్నె జత పడుచు వయసు కోరే ప్రాణం
కలలో..ఇలలో..మెదిలే అలజడి నీదై



అందాల హిమగిరిలో.. నిలువలేని తేజం
మందార మకరందం .. తెలుపలేని నైజం
మారని..మనసు మోయని..బరువు వలచుకొనే !


ఇవ్వాళ నాలో ఏమైంది..గుండెల్లో ఏదో మొదలైందీ

అసలు ఏమిటది మరువలేనిదది సెగలు గొలిపె స్వేదసారం
ప్రధమా..ప్రతిమా..నిలిచి పదవళి నీదై
అసలు ఏమిటది మరువలేనిదది సెగలు గొలిపె స్వేదసారం
ప్రధమా..ప్రతిమా..నిలిచి పదవళి నీదై


శృంగార ఖనిజములో..దొరకలేని వైనం
సింగారి అధరములో..పలుకలేని మౌనం
కోరని..తలపు ఆరని..వలపు రగులుకొనే !


ఇవ్వాళ నాలో ఏమైంది..గుండెల్లో ఏదో మొదలైందీ
ఇవ్వాళ నాలో ఏమైంది..గుండెల్లో ఏదో మొదలైందీ


మనసునా..నిలిచినా..అతని కదలికలేనా..తనువు తడిపినదేమో
కనులు మురిసినవేళా..అడుగు నిలవక రానా !

ఇవ్వాళ నాలో ఏమైంది..గుండెల్లో ఏదో మొదలైందీ

**********************************************
సాహిత్యం: ఎస్.వీరేంద్ర రెడ్డి
గానం: 'జీన్స్ ' శ్రీనివాస్



ఎన్ని ఊసులో ఎద గూటిలో
మూగబోయెనే విధి ఆటలో
ఏడురంగుల హరివిల్లులలో .. ప్రేమ వర్ణమే ఏమైనదో
నిను చేరు దారేది .. నిను కోరు వరమేది


ఓ నేస్తమా .. ఓ నేస్తమా !
ఓ నేస్తమా.. ఓ నేస్తమా !!


ఎన్ని ఊసులో ఎద గూటిలో
మూగబోయెనే విధి ఆటలో


రాలే పూల గుండెలో .. అలజడెన్నడు చూపునా
నవ్వే కళ్ళ మాటునా .. బాధ ఎరుగరు ఏడ్చినా
చెలిమే ప్రేమ వరమే ఇచ్చెనే .. ఓ ఓ
ఆ వరమే ముళ్ళ శరమై గుచ్చెనే ..ఓ ..హోహో


ఓపలేనీ వేదనా ..ఇది అంతులేనీ రోదన
ఎదలోతుల్లో సెలయేరల్లె కన్నీరు వరదాయెలే !


ఓ నేస్తమా .. ఓ నేస్తమా !.
ఓ నేస్తమా.. ఓ నేస్తమా !!


ప్రాణం అయిన బంధమా .. దూరమైతే భారమా
సాగే స్నేహగానమా .. మౌనమాయెను భావమా
గతమే తీపి కలగా వచ్చినా .. ఆ ..ఆ
కలిసే ఆశ కలగా మారెనే .. ఓ ..హోహో


కానరాని తీరము .. ఇది చేరలేని గమ్యము
ఎదసంద్రంలో అలసే నీకు ఓదార్చె దిక్కెవ్వరూ !


ఓ నేస్తమా .. ఓ నేస్తమా !.
ఓ నేస్తమా.. ఓ నేస్తమా !!


ఎన్ని ఊసులో ఎద గూటిలో
మూగబోయెనే విధి ఆటలో
ఏడురంగుల హరివిల్లులలో .. ప్రేమ వర్ణమే ఏమైనదో
నిను చేరు దారేది .. నిను కోరు వరమేది


ఓ నేస్తమా .. ఓ నేస్తమా !.
ఓ నేస్తమా.. ఓ నేస్తమా !!


No comments: