March 06, 2009

నీ సుఖమే నే కోరుతున్నా !

సంగీతం: మధవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: కార్తీక్, చిత్ర



ఏమిటో ఇది..సరికొత్తగున్నదీ
నిన్నా అటు మొన్నా కనరానిదీ
నేడే తొలిసారే తెలిసిందిదీ


ఎందుకో మరి..తడబాటుగున్నదీ
ప్రేమో మరి ఏమో అనలేనిదీ
ప్రియమై పరిచయమై కలిసిందిదీ


నిదురే రాదులే..కుదురే లేదులే..ఎదలో ఏదో పులకింతా
హో తలపుల వాకిలీ..తలుపులు తీసినా..తీయని వింతా గిలిగింతా


సగమే నేనన్నా మాటే వినిపించీ..
జగమే ఈ నాడూ కొత్తగ కనిపించే..


ఏమి చూసినా..నేనేమి చూసినా
నాతో ఒకరున్నారు అన్న భావనా !


ఏమిటో ఇది..ఆ
సరికొత్తగున్నదీ..ఆ
నిన్నా అటు మొన్నా కనరానిదీ
నేడే తొలిసారే తెలిసిందిదీ


కొమ్మా పాతదే..కోయిల పాతదే
వినిపించేనే నవరాగం !
ఆ ఆ.. కమ్మని ఊహలే కలకలమన్నవీ
అనిపించేదే అనురాగం !


కంటికి కనరాకా ఎవరో పిలిచారూ
ఒంటరి నా మదిలో ఎవరో నిలిచారూ


నేడు తోచెనే నా నీడ రెండుగా..
జాడే కనరాకెవరో తోడు ఉండగా !


ఏమిటో ఇది..వూహూ
సరికొత్తగున్నదీ..ఆ హా
నిన్నా అటు మొన్నా కనరానిదీ
నేడే తొలిసారే తెలిసిందిదీ


ఎందుకో మరి..తడబాటుగున్నదీ
ప్రేమో మరి ఏమో అనలేనిదీ
ప్రియమై పరిచయమై కలిసిందిదీ

No comments: