December 29, 2008

రావోయి చందమామ

సంగీతం: మణి శర్మ
గానం: బాలు, చిత్ర



స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ .. కాలేవా చేతి రాతలూ


స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే


నీవే ప్రాణం .. నీవే సర్వం .. నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ .. రేయి పగలూ .. హారాలల్లే మల్లెలు నీకోసం


కోటి చుక్కలూ అష్ఠ దిక్కులూ నిన్ను చూచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనే రాలా
కాలాలే ఆగిపోయినా .. గానాలే మూగబోవునా


నాలో మోహం .. రేగే దాహం .. దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం .. గెలిచే బంధం .. రెండూ ఒకటే కలిసే జంటల్లో


మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం ..వాలేదే ప్రణయ గోపురం



స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ .. కాలేవా చేతి రాతలూ


స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే

No comments: