December 08, 2008

శశిరేఖాపరిణయం (2008)



సంగీతం: మణిశర్మ, విద్యాసాగర్

సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకునీ .. కొలువుంచే మంత్రం నీవవనీ

ప్రతీ పూట పువ్వై పుడతా .. నిన్నే చేరి మురిసేలా
ప్రతీ అడుగు కోవెల అవుతా .. నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేదనవనీ !

నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు మేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏల వలసిన దొరవూ నువ్వే

రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామ సుందరా
మనసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా !

ఆ.. ఆ .. నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాశ వీణలోని మధురిమ నీవే సుమా
గంగపొంగు నాపగలిగిన కైలాసమా
కొంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంత కరిగించీ ధారపోయనా
ఆయువంత వెలిగించీ .. హారతీయనా

నిన్నే నిన్నే నిన్నే ..
ఓ .. నిన్నే నిన్నే నిన్నే !


***************************

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైంధవి


ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం

ఉబికి వస్తుంటే సంతోషం .. అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనూ .. నా వెనుక తానూ
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం !

ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం

ముల్లులా బుగ్గను చిదిమిందా ..
మెల్లగా సిగ్గును కదిపిందా ..
వానలా మనసును తడిపిందా ..
వీణలా తనువును తడిమిందా (2)

చిలిపి కబురు ఏం విందో .. వయసుకేమి తెలిసిందో
చిలిపి కబురు ఏం విందో .. వయసుకేమి తెలిసిందో
ఆదమరుపో .. ఆటవిడుపో .. కొద్దిగా నిలబడి చూద్దాం

ఓ క్షణం ..
అంటే .. కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే .. ఎదురు తిరిగింది నా హృదయం !


*************************************

సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాహుల్ నంబియార్

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా

కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన భ్రాంతివో
కలవనిపించిన కాంతవో .. ఓ ఓ ఓ
మతి మరపించిన మాయవో
మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా

శుభలేఖలా .. నీ కళా .. స్వాగతిస్తుందో
శశిరేఖలా .. సొగసెటో .. లాగుతూ ఉందో
తీగలా .. అల్లగా .. చేరుకోనుందో
జింకలా .. అందకా .. జారిపోనుందో

మనసున తుంచిన కోరికా
పెదవుల అంచును దాటకా
అదుముతు ఉంచకె అంతగా .. ఓ ఓ ఓ
అనుమతినివ్వని ఆంక్షగా
నిలబడనివ్వని కాంక్షగా
తికమక పెట్టకె ఇంతగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా

మగపుట్టుకే .. చేరనీ .. మొగలి జడలోనా
మరుజన్మగా .. మారనీ .. మగువ మెడలోనా హో
దీపమై .. వెలగనీ .. తరుణి తిలకానా
పాపనై .. ఒదగనీ .. పడతి ఒడిలోనా

నా తలపులు తన పసుపుగా
నా వలపులు పారాణిగా
నడిపించిన పూదారిగా .. ఓ ఓ ఓ
ప్రణయము విలువే కొత్తగా
పెనిమిటి వరసే కట్టగా
బతకన నేనే తానుగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా


**************************

సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: జై

ఓ ..గుండెల్లో గోలీసోడా .. బుస్సంటూ పొంగిందంటే
వళ్ళంతా ఆడా ఈడా .. ఝలక్కు రావాలంతే
కళ్ళల్లో కోకా కోలా .. కస్సంటూ పైకొస్తుంటే
చూపుల్లో సంతోషాలా .. చమక్కు చిందాలంతే

ఓ మెరుపుల్లో ఉయ్యాలూగే .. మురిపెం నాకొచ్చిందంటే
మేఘాలే నాదగ్గరికీ .. ఉరుక్కు వస్తాయంతే

డిలక్ డిలక్ డీలాలా ..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా .. అడక్కుమళ్ళా (2)

ఓ గుండెల్లో గోలీసోడా .. బుస్సంటూ పొంగిందంటే
వళ్ళంతా ఆడా ఈడా .. ఝలక్కు రావాలంతే

తుళ్ళే తువ్వాయిలా ఆటల్లో
తుళ్ళింతే రమ్మందీ నన్నీరోజూ
చిన్నీ చిల్లాయిల కూతల్లో
లల్లాయి వింటుంటే ఎంతో మోజు

పసిపాపాయికి రుసుమెంతివ్వనూ
తనకేరింత కాసింత నేర్పేందుకూ
నదిలో చేపకీ ముడుపేమివ్వనూ
తనతో పాటు ఆ లోతు చూపేందుకూ

డిలక్ డిలక్ డీలాలా ..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా .. అడక్కుమళ్ళా (2)

పచ్చా ఓణీలను చేనమ్మా .. చుట్టూరా చుట్టింది ఈ పల్లెల్లో
ఎన్నో వర్ణాలతో సందెమ్మా .. కళ్ళాపే చల్లింది ఆకాశంలో
అటు ఓ అందమూ .. ఇటు పూగంధమూ
ఎటు వెళ్ళాలి పాదాలు తూనీగలై
సరదా సంపదా .. వెనకేసేందుకూ
ఒకటే జన్మ నాకుంది ఈ నేలపై

డిలక్ డిలక్ డీలాలా ..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా .. అడక్కుమళ్ళా (2)


*****************************************

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: రంజిత్

ఓ సారి నా వైపు చూశావూ .. కాసేపు నా గుండె కోసావూ
అందాల బాణాలు వేశావూ .. దాదాపు ప్రాణాలు తీశావూ
ఏ మంత్రమేసీ .. ఏ మాయ చేసీ .. ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ .. ఏకంగా నన్నే .. నా నుండి దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా (2)

ఓ సారి నా వైపు చూశావూ .. కాసేపు నా గుండె కోసావూ
అందాల బాణాలు వేశావూ .. దాదాపు ప్రాణాలు తీశావూ

ఓ చెలీ ఓ చెలీ .. ఓ చెలీ నా చెలీ
ఓ చెలీ ఓ చెలీ .. ఓ చెలీ నా చెలీ

నిన్నా ఎంచకా ఉన్నా .. మొన్నా దర్జాగా ఉన్నా .. ఇవ్వాళ ఏమైందే
గాలే కాటేసినట్టూ .. పూలే కరిచేసినట్టూ .. ఏదేదొ అవుతుందే
ఎర్రా ఎర్రాని చెంపల్లో ..సింధూరాలెన్నో చేరాయీ
ఉర్రూతలూగే ఊహల్లో .. గంధాలే నింపుతున్నాయీ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా (2)

ఓ సారి నా వైపు చూశావూ .. కాసేపు నా గుండె కోసావూ
అందాల బాణాలు వేశావూ .. దాదాపు ప్రాణాలు తీశావూ

ఓ చెలీ ఓ చెలీ .. ఓ చెలీ నా చెలీ
ఓ చెలీ ఓ చెలీ .. ఓ చెలీ నా చెలీ

ఇంకా నా వల్ల కాదూ .. ఇంకో క్షణమైనా నన్నూ .. నేనాపలేనేమో
నీకై ఆరాటలన్నీ .. నాతో పారాడుతుంటే .. నే తాళలేనమ్మో
నీ నోట రాని నా పేరే .. నాదైనా నాకే చేదేలే
నీ సొంతం కాని ఈ జన్మే .. నీరంటూ లేని గోదారే

ఓ సారి నా వైపు చూశావూ .. కాసేపు నా గుండె కోసావూ
అందాల బాణాలు వేశావూ .. దాదాపు ప్రాణాలు తీశావూ
ఏ మంత్రమేసీ .. ఏ మాయ చేసీ .. ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ .. ఏకంగా నన్నే .. నా నుండి దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా (2)


*********************************************

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైంధవి

ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పలేనంది ఏ వైనం
కలతపడుతుందే లోలోనా .. కసురుంటుందే నా పైనా
తన గుబులు నేనూ .. నా దిగులు తానూ
కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం !

ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పలేనంది ఏ వైనం

పచ్చగా ఉన్నా పూదోటా .. నచ్చడం లేదే ఈ పూటా
మెచ్చుకుంటున్నా ఊరంతా .. గిచ్చినట్టుందే నన్నంతా (2)

ఉండలేను నెమ్మదిగా .. ఎందుకంటే తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా .. ఎందుకంటే తెలియదుగా
తప్పటడుగో .. తప్పు అనుకో
తప్పదే తప్పుకు పోదాం ..

తక్షణం ..
అంటూ .. అడ్డుపడుతుంది ఆరాటం
పదమంటూ .. నెట్టుకెడుతోంది నను సైతం !



No comments: