December 24, 2008

పెళ్ళిపుస్తకం

బాపు-రమణ గారి చిత్రాలలో 'పెళ్ళిపుస్తకం' కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 'శ్రీరస్తూ శుభమస్తూ..శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం' అనే పాట పలకని పెళ్ళి కాని, ఆ పాట లేని పెళ్ళి కాసెట్ కాని, సీడీ లేవంటే అతిశయోక్తి కాదు. నాకు బాపూ గారి బొమ్మలంటే ప్రాణం , రమణ గారి మాటలంటే ఇష్థం. తెలుతనం నిండుగా కనిపిస్తుంది వీరి చిత్రాలలో. మధ్య తరగతి జీవితం, ఆలుమగల మధ్య అనురాగం బాపూ గారు చూపించినట్లుగా ఇంకెవరూ చూపించలేరేమో!

దివ్యవాణి ఆల్చిప్పల్లాంటి కళ్ళు కానీ, రాజేంద్రప్రసాద్ మాటల చమత్కారాలు కానీ, గుమ్మడి గారి 'నేనూ..' అని మొదలెట్టే మాటలు కానీ..ఒకటేమిటి అన్నీ అన్నీ ఎంతో బాగా నచ్చాయి నాకు. చివరగా చెప్తున్నానని కాకుండా, 'మామ' కె.వి.మహదేవన్ గారి బాణీలు అధ్బుతం !

సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి

సరికొత్త చీర..
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించి నాను
మనసూ మమత..పడుగూ పేక చీరలో చిత్రించి నాను
ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా...

ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు..ముళ్ళూ వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు ..అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కల బోస్తా..నీ కొంగుకు చెంగున ముడి వేస్తా
ఈ అందాలన్నీ కల బోస్తా..నీ కొంగుకు చెంగున ముడి వేస్తా

ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా...

చుర చుర చూపులు ఒక మారూ..నీ చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారూ..నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు
నువ్వు ఏ కళనున్నా మహ బాగే..ఈ చీర విశేషం అలాగే
నువ్వు ఏ కళనున్నా మహ బాగే..ఈ చీర విశేషం అలాగే

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించి నాను
మనసూ మమత..పడుగూ పేక చీరలో చిత్రించి నాను
ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా...

*************************************

No comments: