December 29, 2008

గులాబి

సంగీతం : శశీ ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల
గానం : శశీ ప్రీతం



ఏ రోజైతే చూసానో నిన్ను..ఆ రోజే నువ్వు అయిపొయా నేను
కాలం కాదన్నా ఏదూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా

నీ కష్టం లో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఒదార్పౌతాను


కాలం ఏదో గాయం చేసింది
నిన్నే మాయం చేసానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది
శోకం పిండి జో కొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా


 
ఆఆ ..నీతో గడిపిన ఆ నిముషాలన్ని
నాలో దాగే గుండెల సవ్వడులే
జరిగే వింతే నే నమ్మేదెట్టాగా
నువు లేకుంటే నేనంటు ఉండనుగా


 
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో


నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టం లో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఒదార్పౌతాను

 
*****************************************************


గానం : సునీత


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ


ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము...గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది


నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనె ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

No comments: