December 12, 2008

సిరిసంపదలు (1962)

సంగీతం: మాస్టర్ వేణు
గానం: ఘంటసాల, పి.సుశీల

ఈ పగలు రేయిగా..పండు వెన్నెలగ మారినదేమి చెలీ..ఆ కారణమేమి చెలీ
ఆఁ..ఊఁ
వింతకాదు నా చెంతనున్నది..వెండి వెన్నెల జాబిలీ..నిండుపున్నమి జాబిలీ
ఓ..ఓ..ఓ..

మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
అహా..ఒహో..అహా..ఆ..ఆ

మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు
హ్మ్ ..

వెండి వెన్నెల జాబిలీ..నిండుపున్నమి జాబిలీ
కన్నులు తెలిపే కథలనెందుకు..రెప్పలార్చియే మార్చేవు..
ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఓ ఓ ఓ

కన్నులు తెలిపే కథలనెందుకు..రెప్పలార్చియే మార్చేవు..
చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని ఝడిసేవు
ఓహోహో

వెండి వెన్నెల జాబిలీ..నిండుపున్నమి జాబిలీ
అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
హ హ హ

అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకర్ధము చూపేను
ఆహా

వెండి వెన్నెల జాబిలీ..నిండుపున్నమి జాబిలీ

No comments: