February 10, 2009

రక్షణ

గానం: ఎం.ఎం. కీరవాణి, చిత్ర


ఏ జన్మదో .. ఈ సంబంధమూ
ఏ రాగమో .. ఈ సంగీతమూ


మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో


ఏ జన్మదో .. ఈ సంబంధమూ

ఒకరికోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం


పెళ్ళాడుకున్న అందం .. వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం .. పలికించె ప్రేమవేదం
అందాల గుడిలోన పూజారినో .. ఓ బాటసారినో !


ఏ జన్మదో .. ఈ సంబంధమూ

లతలు రెండూ .. విరులు ఆరై .. విరిసె బృందావనీ
కలలు పండీ .. వెలుగులాయే .. కలిసి ఉందామనీ


వేసంగి మల్లె చిలకై .. సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికే .. కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో .. ఈ తోటమాలిదో


ఏ జన్మదో .. ఈ సంబంధమూ
ఏ రాగమో .. ఈ సంగీతమూ


మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో .. ఈ సంబంధమూ

No comments: