March 06, 2009

kavya's dairy


kavyas dairy


గానం : పార్ధసారధి, శ్రీలేఖ
సాహిత్యం : అనంత్ శ్రీరామ్



ఓ ప్రాణమా ....రామ్మా ....అందించుమా ప్రేమ
నీ చేతిలో నా చేతినే చేర్చా ఇలా ఆనందమా
నీ చెంతనే నా చెంపనే ఉంచా ఇలా ఆశించుమా

ఓ ప్రాణమా ....రామ్మా ....అందించుమా ప్రేమ

నీ నీడలో ఏదో వేడుంది చాలా
ఆ వేడి లోలోనా ఆడిందిలా
ఓసారి నా మనసు చేజారీ నీ వరకు వెళ్ళింది నా వైపే రానందీ
నా నుండి నా తనువు వేరైంది నీ కొరకు వేచింది నా రూపే నీదందీ

ఓ ప్రాణమా ....రామ్మా ....అందించుమా ప్రేమ


నీ చూపులో ఎంతో కైపుంది చాలా
ఆ కైపు లోలోన పొంగిందిలా
నీ వెంటే నా తలపు నిన్నంటే నా వలపు ఉంటుంటే నీవయసు ఏమందీ

భంధించే కౌగిలిలో కరిగించు కోరికలే అంటుందా అందము నీ తోడుండీ
ఓ ప్రాణమా ....రామ్మా ....అందించుమా ప్రేమ
నీ చేతిలో నా చేతినే చేర్చా ఇలా ఆనందమా
నీ చెంతనే నా చెంపనే ఉంచా ఇలా ఆశించుమా

ఓ ప్రాణమా....రామ్మా...అందించుమా ప్రేమ
************************************


సంగీతం: మను రమేష్
గానం : హేమచంద్ర
సాహిత్యం : అనంత్ శ్రీరామ్


హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
ఆమ్మ పంచే ప్రేమలోనా అమృతాలే అందగా
పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా


హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
ఆమ్మ పంచే ప్రేమలోనా అమృతాలే అందగా
పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా


వానలోన తడిచొస్తుంటే ఊరుకోగలదా
అంతలోనే ఆయొచ్చిందో తట్టుకోగలదా
పాఠమే చెపుతుండగా ఆట పట్టిస్తే
మీనాన్నతో చెబుతానని వెళుతుంది కోపగించి
మరి నాన్నలా తిడుతుండగా తను వచ్చి ఆపుతుంది
మమతలు మన వెంట తోడుంటే

హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే


పాలు నీళ్ళై కలిసే వారి అలుమగలైతే
పంచదారై కలిసిందంట పాప తమలోనే
ఆమని ప్రతి మూలలో ఉంది ఈ ఇంట
ప్రతి రోజున ఒక పున్నమి వస్తుంది సంబరంతో
కలకాలము కల నిజములా కనిపించెనమ్మ కంట్లో
కళ కళలే కళ్ళ ముందుంటే


హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
ఆమ్మ పంచే ప్రేమలోనా అమృతాలే అందగా
పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా


***************************************** ********
గానం : టిప్పు
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి


పో వెళిపో అన్నా పోను ....నీతో నడిచే నీడే నేను
పో వెళిపో అన్నా పోను ....నీతో నడిచే నీడే నేను
కోపమైతే కసురుకో నన్ను..నిన్ను మాత్రం వదలనే లేను

నువ్వు పో వెళిపో అన్నా పోను నీతో నడిచే నీడే నేను


సీతలాంటి సిగ్గు పూల బంతికి కోతి చిందులెందుకే ...హే హె హే
లే గులాబి సున్నితాల చెంపకి ఆవిరంటనివ్వకే
క్షణాల మీద కస్సుమన్న అందమా
ప్రేమనేది నేరమా ఆపవమ్మ అంతులేని డ్రామా
నా గుండెలోన గుప్పు మన్న మరువమా నిప్పులాంటి పరువమా
కొప్పులోన నన్ను ముడుచుకోమ్మా


పో వెళిపో అన్నా పోను ....నీతో నడిచే నీడే నేను


లోకమంతా వెతికినా దొరకదే నీకు ఇలాంటి అందమే
ఎందుకంటె కారణం తెలియదే నువ్వు నాకు ప్రాణమే
నీ కళ్ళలోనా ఉన్న మాట దాచకే ఆగిపోకు ఊరికే
పెదవి కదిపి చెప్పుకోవే ఒకే
నా లాంటి నన్ను అంత దూరం ఉంచకే వేరుగా చూడకే
పారిపోతే నష్టమంతా నీకే

పో వెళిపో అన్నా పోను ....నీతో నడిచే నీడే నేను
పో వెళిపో అన్నా పోను ....నీతో నడిచే నీడే నేను
కోపమైతే కసురుకో నన్ను..నిన్ను మాత్రం వదలనే నేను

నువ్వు పో వెళిపో అన్నా పోను నీతో నడిచే నీడే నేను


***************************************** **
గానం : కార్తీక్ , రీటా
సాహిత్యం : అనంత్ శ్రీరామ్



తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి
తెలుసుకో నన్నే నీ గుండెనే తెరిచి
తెలపాలి నువ్వైనా
తెలపాలి నువ్వైనా నేనే తెలుపలేకున్నా
తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి

నీ చేరువై నేనుండగా ఈ దూరమేమిటో ఇంతగా
అనుకొనే నా మనసునే వినవా
నీ స్వాశ సోకితె చాలని ఆ ఆశ ఇంకిపోలేదని
నిజమునే నీ పెదవితో అనవా
..హో
తలచుకుంటాను నువ్వు నేనే తలచేవని ఈ క్షణం
నిదురలేస్తాను ఎదురుగా కదలేవని ఈ దినం .....

నేనే

అపుడేమొ పెదవి పై నవ్వులే ఇపుడేమో నవ్వులొ నలుపులే
ఎందుకా చిరునవ్వులో మసకా

అపుడెంత కసిరినా మాములే ఇపుడేమి జరిగినా మౌనమే
ఎందుకే నీ మాటలో విసుగా
కలిసి రావాలి వెంటనే కాలాలు మనకోసమే
దరికి చేరాలి అంతలో భారాలు మమకారమై
నేనే తెలుపలేకున్నా


నీతో నేనే తెలుపలేకున్నా


***************************************** ***
గానం : గీత మాధురి , ప్రణవి

సాహిత్యం : అనంత్ శ్రీరామ్


ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలెన్నో

నిన్నా మొన్నా నాతో ఉన్న ఉల్లాసాలెన్నో
భలమైన జ్ఞాపకాలై బ్రతుకంత నాకు తోడై ఉండే బంధాలెన్నో

ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలెన్నెన్నో


చిలిపితనంతో చెలిమి ఎదల్లో దోచిన విరులెన్నో
చురుకుదనంతో చదువుల ఒళ్ళో గెలిచిన సిరులెన్నో

అందాల అల్లర్లే ఇంకా గుర్తు ఉన్నవి
ఆనాటి వెన్నలలే నన్నే పట్టి ఉన్నవి
మళ్ళీ ఆ కాలాలే రావాలి అంటు నా కన్నుల్లో కలలెన్నో

ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలెన్నెన్నో


నవ్వులకైనా నవ్వులు తుళ్ళే నిమిషాలెన్నెన్నో
శ్వాసలలోన ఆశలు రేపే సమయాలింకెన్నో
బంగారు జింకల్లే చిందే ఈడులే అది
ముత్యాల మబ్బల్లే కురిసే హాయిలే ఇదీ
చెదరదు లే ఆ స్వప్నం ఈ రోజు
చెరగదు లే ఆ సత్యం ఏ రోజు

ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలెన్నో
నిన్నా మొన్నా నాతో ఉన్న ఉల్లాసాలెన్నో
భలమైన జ్ఞాపకాలై బ్రతుకంత నాకు తోడై ఉండే బంధాలెన్నో

ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలెన్నెన్నో