నువ్వంటే నాకిష్ఠం..నీ నవ్వంటే నాకిష్ఠం
నువ్వంటే నాకిష్ఠం..నా నువ్వైతే నాకిష్ఠం
నాలో ఆలాపనా..ఆగేనా ఆపినా..
ఎదలో లయా వినవా ప్రియా !
నువ్వంటే నాకిష్ఠం..నీ నవ్వంటే నాకిష్ఠం
చేరువా దూరమూ లేవులే.. ఇష్ఠమైనా ప్రేమలో
ఆశలే కంటిలో బాసలై ఇష్ఠమాయే చూపులే
కోపతాపాల..తీపి శాపాల..ముద్దు మురిపాల కధ ఇష్ఠమే..
ఎంత అదృష్ఠమో మన ఇష్ఠమే ఇష్ఠమూ
నువ్వంటే నాకిష్ఠం..నీ నవ్వంటే నాకిష్ఠం
ఎగసే ఆ గువ్వల కన్నా...మెరిసే ఆ మబ్బుల కన్నా..
కలిసే మనసేలే నాకిష్ఠం !
పలికే ఈ తెలుగుల కన్నా..చిలికే ఆ తేనెల కన్నా..
చిలకా గోరింకకు నువ్విష్ఠం !!
ఇష్ఠసఖి నువ్వై..అష్ఠపది పాడే..అందాల పాటల్లో నీ పల్లవిష్ఠం !!!
నువ్వంటే ఎంతిష్ఠం
నీ ప్రేమంటే అంతిష్ఠం
నేనంటే నాకిష్ఠం
నాకన్నా నువ్విష్ఠం
No comments:
Post a Comment