March 30, 2009

సుందరకాండ

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: సాధనా సర్గం



ఏలో ఏలో ఉయ్యాల.. ఏడేడు రంగుల ఉయ్యాలా
ఏలో ఏలో ఉయ్యాల.. ఏడేడు రంగుల ఉయ్యాలా

ఎదిగే వయసుల ఉయ్యాల..ఎగిరే పైటల ఉయ్యాల
ఎదిగే వయసుల ఉయ్యాలా..ఎగిరే పైటల ఉయ్యాలా

ఏదో ఏదో అయ్యేలా..

ఏలో ఏలో ఉయ్యాల.. ఏడేడు రంగుల ఉయ్యాలా !
ఏలో ఏలో ఉయ్యాల.. ఏడేడు రంగుల ఉయ్యాలా !!


అనగనగా అనగనగా ఉయ్యాలా
అడవీ పక్కన పల్లె ఉయ్యాలా
ఆ పల్లె జాబిల్లి..బంగారు నా తల్లి..అందాల సిరిమల్లి..ఉయ్యాలా
ఆ కోనలో ఒకనాడు..కోటలో దొరబాబు..వచ్చీ మల్లిని చూసే ఉయ్యాలా


మనసు పడీ మనువాడే ఉయ్యాలా
ముద్దూ ముచ్చట జరిపీనాడే ఉయ్యాలా
మల్లీనక్కడ విడిచీనాడే ఉయ్యాలా
మళ్ళీ తిరిగీ రాలేదమ్మా ఉయ్యాలా
మళ్ళీ తిరిగి రాలేదమ్మా ఉయ్యాలా


ఏలో ఏలో ఉయ్యాల.. ఏడేడు రంగుల ఉయ్యాలా !
ఏలో ఏలో ఉయ్యాల.. ఏడేడు రంగుల ఉయ్యాలా !!

రాముని కాలపు సీతమ్మా..ఆ సీతమ్మే మాయమ్మా
రాముని కాలపు సీతమ్మా..ఆ సీతమ్మే మాయమ్మా


తన గుండె గుడి చేసె ఉయ్యాలా
ఆ గుడిలోన దేవుడూ ఉయ్యాలా
ఒక్కడే ఉన్నాడు ఉయ్యాలా
ఒక్కడే ఉంటాడు ఉయ్యాలా


ఒక్కడే ఉంటాడు ఉయ్యాలా !

No comments: