సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఎస్.పి.చరణ్, కల్పన
చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా !
పెదవే కదిలించుకో..మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా !
సరెలే అనిపించుకో..త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచి చూస్తున్నా !
చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా !
గుండెలయలో..ఓ ఓ ధీంతధిరనా
ఎన్ని కధలో..ప్రేమవలనా
హాయి అలలో..ఓ ఓ ఊయలవనా
రేయినదిలో.. జాబిలవనా
నీ ప్రేమలోనే మేలుకుంటున్నా
మేఘాలపైనే తేలిపోతున్నా
నాకు తెలియని నన్ను కనుగొని నవ్వుకుంటున్నా !
చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
వెంటనడిచే.. ఓ ఓ నీడననుకో
జంటనడిపే .. జాడననుకో
పూలు పరిచే .. ఓ ఓ దారిననుకో
నిన్ను కలిసే .. బంధమనుకో
నా ప్రేమలోకం నువ్వే అంటున్నా
నీతో ప్రయాణం ఇష్థమేనన్నా
ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా !
చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా !
పెదవే కదిలించుకో..మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా !
సరెలే అనిపించుకో..త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచి చూస్తున్నా !
చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా !
**********************************************
గానం: హేమచంద్ర, మాళవిక
అరెరెరె ఏమది..పరిగెడుతుంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ
తనువంతా పులకిస్తున్నది..చిగురాకై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నది..మనసు ఎందుకో మరీ !
నీలాగే నాకూ ఉన్నది..ఏదేదో అయిపోతున్నది
నా ప్రాణం నువ్వంటున్నది..మనసు ఎందుకే ప్రియా మరి మరి !
అరెరెరె ఏమది..పరిగెడుతుంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ
లేత పెదవుల తీపి తడీ..మొదటి ముద్దుకు ఉలికిపడీ మేలుకున్నదీ
ఎడమవైపున గుండెసడీ..ఎదురుగా నీ పిలుపు వినీ వెల్లువైనదీ
తొలి వెన్నెలంటే తెలిపిందీ..నీ జతలో చెలిమీ
తొలి వేకువంటె తెలిసిందీ..నీ చెయ్యే తడిమీ
అరెరెరె ఏమది..పరిగెడుతోంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ
కనులు చూసిన తొలివరమూ..కలలు కోరిన కలవరమూ నిన్నలేదిదీ
చిలిపి సిగ్గుల పరిచయమూ..కొంటె నవ్వుల పరిమళమూ మత్తుగున్నదీ
మన మధ్య వాలి చిరుగాలి..నలిగిందే పాపం
పరువాల లాలి చెలరేగీ..చెరిగిందే దూరం
అరెరెరె ఏమది..పరిగెడుతోంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ
No comments:
Post a Comment