March 30, 2009

ఈ అబ్బాయి చాలా మంచోడు

సంగీతం: కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కీరవాణి, గంగ



ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు
ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు
ప్రేమా..ఆ..ఆ !

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు
ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు
ప్రేమా..ఆ..ఆ !

పసిపాపలో ముసి నవ్వులా కపటాలు లేని ప్రేమ
మునిమాపులో మరు మల్లెలా మలినాలు లేని ప్రేమ
అరచేతిలో నెలవంకలా తెరచాటు లేని ప్రేమ
నది వంపులో అల పాటలా తడబాటు లేని ప్రేమ

మనసుల కలిమిడి ఫలితం ప్రేమ
తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవన యాత్రలో తోడు ప్రేమా
ప్రేమా.. ఆ..ఆ !

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు
ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు
ప్రేమా..ఆ..ఆ !

అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమ
హృదాయాలలో ధ్రువతారలా అలరారుతుంది ప్రేమ
పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమ
ప్రాణాలలో స్థిరభంధనం నెలకొలుపుతుంది ప్రేమ

మమతల అమృత వర్షిణి ప్రేమ..
ఊర్పుల అలజడి కాదు సుమా..
నిశీధిలోను వీడిపోని నీడ ప్రేమ..
ప్రేమా..ఆ..ఆ !

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు
ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవూ
ప్రేమా..ఆ..ఆ !



******************************************


గానం: కళ్యాణి మాలిక్, సునీత


చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో

నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ
పగడపు దీవి కి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

నువ్వే నాకు ముద్దొస్తావనీ
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాటలోనా.. రతనాల తోటలోన
వజ్రాల మేడలోన.. బంగరు గదిలోన

విరి తేనెల్లో పాలల్లో తానా లాడేసి
నెల వంకల్లో వెన్నెల్నే భోంచేసి
నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి

చిలకే కొరికి ..దరికే జరిగి మురిపెం పెరిగి

మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
ముద్దుల్లోన ముద్దవుతాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా

అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యలూగేసి
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
అహ పళ్ళళ్ళో మైకం తో మోహం కమ్మేసి

చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా

మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడి వేదాలు ముద్రిస్తావనీ
నమ్మడానికి ఎంత బాగుందో

నీ కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవి కి నిన్నే నేను తీసుకెళ్తాననీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

No comments: