November 10, 2009

తాజ్ మహల్ (2009)



Powered by eSnips.com



గానం: కార్తీక్
సంగీతం : అభిమాన్
సాహిత్యం :భాస్కరభట్ల

నీమీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ
నీవల్లే నిదుర చెడీ .. లేచానే ఉలికి పడీ
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదో చెప్పాలి ఉందే

కళ్ళే వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ

మునిగిందిలే మది నీ ధ్యాసలో ..తేలదు కదా ఇక ఈ జన్మలో
మునిగిందిలే మది నీ ధ్యాసలో ..తేలదు కదా ఇక ఈ జన్మలో
హృదయాలనే జత కలిపేందుకూ .. వలపన్నదే కద ఒక వంతెనా
మౌనమా కొంచెం మాటాడమ్మా
ఈ దూరమే కొంచెం తగ్గించమ్మా (2)

నా కళ్ళే వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ

చిరుగాలిలా నువ్వు వస్తావనీ .. తెచ్చానులే పూల గంధాలనీ
చిరుగాలిలా నువ్వు వస్తావనీ .. తెచ్చానులే పూల గంధాలనీ
ప్రతిరోజు నీకై ఆలోచనా .. వినిపించదా నా ఆలాపనా
ఊరికే నను వేధించకా .. చిరునవ్వుతో చెలి కరుణించవా
ఊరికే నను వేధించకా .. చిరునవ్వుతో చెలి కరుణించవా

నా కళ్ళే వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ
నీవల్లే నిదుర చెడీ .. లేచానే ఉలికి పడీ
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదో చెప్పాలి ఉందే

*****************************

గానం: కునాల్ గంజావాలా
సాహిత్యం : భాస్కరభట్ల
సంగీతం : అభిమాన్

" తనంటే నాకు చాలా ఇష్ఠం
తనకూ నేనంటే ఇష్ఠం .. :) అనుకుంటా ! "


ఎటు చూసిన ఉన్నది నువ్వే కదా
చెలి ఆ నువ్వే నాకిక అన్నీ కదా
ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా
నువ్వే లేనిదే ఏమీ తోచదే
నిన్నే తలవనీ రోజే ఉండదే

సెలయేరు చేసే గలగల సవ్వడి వింటే .. నీ పిలుపే అనుకుంటా
చిరుగాలి తాకీ గిలిగింతలు పెడుతుంటే .. నువ్వొచ్చావనుకుంటా
మైమరపేదో కమ్మిందో ఏమో !

నా మనసుకి కదలిక నీవల్లనే
నా కనులకి కలలూ నీవల్లనే

ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా

వెలుగుల్ని పంచే మిణుగురు పురుగుల పైనా .. నీ పేరే రాశాలే
నువ్వొచ్చే దారుల్లో నవ్వుల పువ్వులు పోసీ .. నీ కోసం చూశానే
చెలియా ఎప్పుడు వస్తావో ఏమో !

నా చెరగని గురుతువి నువ్వే కదా
నా తరగని సంపద నువ్వే కదా

ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా

****************************

గానం: మాళవిక
సంగీతం : అభిమాన్
సాహిత్యం : రామజోగయ్యశాస్త్రి

నువ్వంటే ఇష్ఠమనీ .. నీతోనే చెప్పమనీ
పెదవంచున తేనెలు చిలికే పాటయ్యిందీ ప్రేమా
వెంటాడే నీ కలనీ .. నిజమయ్యేదెప్పుడనీ
కన్నంచున నిన్నే వెతికే వెలుగయ్యిందీ ప్రేమా

ఏ చోట నేనున్నా .. నీ పిలుపు వింటున్నా
ఆ .. ఏ వైపు చూస్తున్నా .. నిన్నే పలకరిస్తున్నా
కనుమరుగై నువ్వుంటే నిను చూడాలనిపిస్తుందీ
ప్రతి తలపూ నీకోసం ఆహ్వానం అందిస్తుందీ

ఎంత సేపో ఇలాగ నీతో ఊసులాడే సరాగమేంటో
నలిగింది కాలం చాలా జాలిగా
నిన్న లేనీ వసంతమేదో వంత పాడే స్వరాల వలలో
వెలిగింది మౌనం మరో మాటగా

మునుపెన్నడు తెలియని ఈ వరసేదో నీవలనేగా !

తెల్లవారే తూరుపులోనా .. పొద్దువాలే పడమరలోనా
నీ స్పర్శలాంటీ ఏదో లాలనా
గాలి మేనా సవారిలోనా .. తేలిపోయే ఏ రాగమైనా
నీ శ్వాసలానే సమీపెంచెనా

ప్రతినిమిషం ఆరాటం గా నీకోసం నే చూస్తున్నా !

నువ్వంటే ఇష్ఠమనీ .. నీతోనే చెప్పమనీ
పెదవంచున తేనెలు చిలికే పాటయ్యిందీ ప్రేమా
వెంటాడే నీ కలనీ .. నిజమయ్యేదెప్పుడనీ
కన్నంచున నిన్నే వెతికే వెలుగయ్యిందీ ప్రేమా

ఏ చోట నేనున్నా .. నీ పిలుపు వింటున్నా
ఏ వైపు చూస్తున్నా .. నిన్నే పలకరిస్తున్నా
కనుమరుగై నువ్వుంటే నిను చూడాలనిపిస్తుందీ
ప్రతి తలపూ నీకోసం ఆహ్వానం అందిస్తుందీ

No comments: