January 07, 2009

ధం (Dhum)

సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: హరిహరన్, నందిత



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా

వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలనీ
తోడుగ ఉండి మనసంతా నిండి నడిపించే జతనీ



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా


నువ్వున్నది నాకోసం .. నేనే నీకోసంలా .. నిలిచే మన ప్రేమలా
నువు లేని ప్రతి నిముషం .. ఎదలోని ఒక గాయంలా .. కరిగే ఈ కన్నీటిలా
మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమా .. పరువపు పూలవానలే
ఇరువురి వలపు వంతెనే .. సకలం ప్రేమ సొంతమే



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా



I love you .. I love you .. I love you .. I love you .. I love you !


నిదురంటు మటు మాయం .. కుదురంటూ కరువే
ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం .. ప్రతి ఊసూ మైకం
ప్రతి చూపు పులకింతలే
చెదరని ఇంద్రధనుసులే ఈ ప్రేమా .. తొలకరి వాన జల్లులే
కరగని పండు వెన్నెలే ఈ ప్రేమా .. కలిగిన వేళ హాయిలే



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలనీ
తోడుగ ఉండి మనసంతా నిండి నడిపించే జతనీ


చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా !

No comments: