January 27, 2009

చంటబ్బాయి (1986)

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం



నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ
..ఊపిరే ప్రేమ !



నిన్ను చూడకా నిదురపోనీ..రెండు నేత్రాలు
కలల హారతి నీకు పట్టే..మౌన మంత్రాలు
నిన్ను తాకక నిలవలేని..పంచ ప్రాణాలూ
కౌగిలింతల గర్భగుడిలో మూగ దీపాలు
ప్రేమ మహిమ తెలుప తరమా..
ప్రేమే జీవన మధురిమ !



నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ
..ఊపిరే ప్రేమ !



'ఏంట్రా ! చల్లగా ఉందని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపొయావా ? బడుద్దాయ్ !
వళ్ళు మటుకు బాగా పెంచేస్తున్నావురా..
ఏం తింటున్నావ్ ? బండలు..కొండలు తింటున్నావా? లేకపోతే సూపరేసి పెంచుతున్నావా? రాస్కెల్ !'


'నాకు బాగానే వినిపిస్తుందండి..చెవుడు నాక్కాదు..మా అన్నయ్యకి.. మేమిద్దరం కవలపిల్లలం !'
ఆఁ !


'స్త్రీ' అనే తెలుగక్షరం లా నీవు నిలుచుంటే
క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా
'ఓం 'అనే వేదాక్షరం లా నీవు ఎదురైతే
గానమై నిన్నాలపించే..ప్రణవమై ఉంటా


ప్రేమ మహిమ తెలుప తరమా..
ప్రేమే జీవన మధురిమ !


నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ
..ఊపిరే ప్రేమ !


**************************

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం


ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా
చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా !



ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం



చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ
పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ
జాణవున్న తావునే జాజిమల్లి తావులు
ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ
వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా !



ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం



ఈ నిశీధి వీధిలో బాటసారినై
ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై
నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో
నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో



వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా !



ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా
చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా
!

1 comment:

చైతన్య said...

manchi songs post chesaru... naku kuda ee rendu songs chala ishtam!