October 31, 2013

ఎటో వెళ్ళిపోయింది మనసు (2012)

గానం: కార్తీక్
సాహిత్యం: అనంత శ్రీరాం

సంగీతం: ఇళయరాజాకోటి కోటి తారల్లోన .. చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే
కోటి కోటి తారల్లోన .. చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం .. తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సు నే చేస్తుంటానే

గాలిలోన ఆరోప్రాణం .. కలవకుండ ఉన్నన్నాళ్ళు

నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసమారాతీస్తా ..

ఏడు వింతలున్నన్నాళ్ళు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్ళు నీ నడకలాగా నేనుంటా ..కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్నన్నాళ్ళు నీ గీతలాగా నేనుంటా .. జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవనా
సంకేలల్లె బం
ధిస్తుంటా వంద ఏళ్లిలా

కోటి కోటి తారల్లోన .. చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం .. తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సు నే చేస్తుంటానే

భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్ళు నీ వెనుక నేను వేచుంటా .. నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్ళు నీ ముందుకొచ్చి నుంచుంటా .. నువ్వెలాగ ఉన్నావో చూడనా
నీకు దూరమున్నన్నాళ్ళు జ్ఞ్యపకంగా వెంటుంటా
మళ్లి మళ్లి గుర్తొస్తుంట ముందు జన్మలా

No comments: