April 22, 2009

తొట్టిగాంగ్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం: ఎస్.పి.చరణ్, సుమంగళి



నువ్వే కావాలీ..నీ నవ్వే కావాలీ
నువ్వే నేనూ..నేనే నువ్వై ఉండాలీ


నువ్వే కావాలీ..నీ ప్రేమే కావాలీ
తోడూ నీడా అన్నీ నీవై ఉండాలీ


నీ కోసమే వెతికా..నీ ఊహతో బ్రతికా
నీ రాక నిజమేనా !


నువ్వే కావాలీ..నీ ప్రేమే కావాలీ
తోడూ నీడా అన్నీ నీవై ఉండాలీ


ఆశా నువ్వే..నా శ్వాసా నువ్వే
నా ఊహా నువ్వే..జీవం నువ్వే..ప్రేమా నువ్వే


ప్రాయం నువ్వే..నా ప్రాణం నువ్వే
నా గమ్యం నువ్వే..ధైర్యం నువ్వే..అన్నీ నువ్వే


అందమైన బంధమై అల్లుకుంటాలే
హత్తుకోవే ముద్దుగా ప్రేమ వీణా


తొలి కౌగిలే సాక్షిగా !

నువ్వే కావాలీ..నీ నవ్వే కావాలీ
నువ్వే నేనూ..నేనే నువ్వై ఉండాలీ


ప్రేమే దైవం .. ప్రేమేగా లోకం
ప్రేమేగా ప్రాణం .. ప్రేమేగా సర్వం .. ఏ నాటికీ


నువ్వే దైవం .. నువ్వే నా లోకం
నువ్వే నా ప్రాణం .. నువ్వే సర్వం .. నా ప్రేమకీ


గుండెల్లోనే నిన్ను నే దాచుకున్నానే
కంటిలోన పాపల్లే చూసుకోనా


మన ఊపిరే ప్రేమగా !

నువ్వే కావాలీ..నీ నవ్వే కావాలీ
నువ్వే నేనూ..నేనే నువ్వై ఉండాలీ


నువ్వే కావాలీ..నీ ప్రేమే కావాలీ
తోడూ నీడా అన్నీ నీవై ఉండాలీ

నీ కోసమే వెతికా..నీ ఊహతో బ్రతికా
నీ రాక నిజమేనా !

No comments: