సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సాగర్
ఏదో ప్రియ రాగం వింటున్నా చిరు నవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీవేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరి మువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటూపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నా వెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాటా సత్యం
నువ్వుంటే మనసంతా ఎదో తియ్యని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఎదో సంతోషం
పాట పాడదా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం
అడవినైనా పూదోట చెయ్యదా ప్రేమ బాట లో పయనం
దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాశం నా స్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిత్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ స్వంతం
నువ్వుంటే చిరుగాలే చందం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతి మాటా వేదం
నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియ లోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగలు నీవల్లే
సిమల్లెలల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వత మనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడా పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే
****************************
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : kay kay
feel my love
నా ప్రేమను కోపం గానో
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానీ
చెలియా feel my love
నా ప్రేమను భారం గానో
నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో
సఖియా feel my love
నా ప్రేమను మౌనం గానో
నా ప్రేమను హీనం గానో
నా ప్రేమను శూన్యం గానో
కాదో లేదో ఏదో కాదో
feel my love ..feel my love
feel my love .. feel my love
నా ప్రేమను కోపం గానో
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానీ
చెలియా feel my love
హే ... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తు feel my love
నే పంపే పువ్వులనే విసిరేస్తు feel my love
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ feel my love
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే feel my love
నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదనీ
నేనంటే గిట్టదంటూ నా మాటే చేదనీ
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే
feel my love ..feel my love
feel my love .. feel my love
నా ప్రేమను కోపం గానో
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానీ
చెలియా feel my love
ఎరుపెక్కీ చూస్తూనే కళ్ళారా feel my love
ఏదోటి తిడుతూనే నోరారా feel my love
విదిలించి కొడుతూనే చెయ్యారా feel my love
వదిలేసి వెళుతూనే అడుగారా feel my love
అడుగులకే అలసటొస్తే చేతుకి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే
feel my love ..feel my love
feel my love .. feel my love
నా ప్రేమను కోపం గానో
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానీ
చెలియా feel my love
No comments:
Post a Comment