కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా..
నిజం తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా..
ఎదుటే.. ఎపుడూ తిరిగే వెలుగా..
ఇదిగో..ఇపుడే..చూసా సరిగా..
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా..
అయితే నాకీనాడే పొద్దుజాడ తెలిసింద కొత్తగా !
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా..
నిజం తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా..
పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసిందీ..
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తొందీ..
ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోందీ..
అయితేనే ఆ అలజడి లో ఒక ఆనందం ఉందీ..
దూరం మహ చెడ్డదనీ ఈ లోకం అనుకుంటుందీ..
కానీ ఆ దూరమె నిన్ను దగ్గర చేసిందీ…
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసిందీ..
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలె నా ఊపిరైనవని !
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా..
నిజం తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా..
ప్రతి నిముషం నా తలపంతా నీ చుట్టూ తిరిగిందీ ..
ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తుందీ..
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయం అయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టూ నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన ఋజువియ్యమంది మరి !
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా..
నిజం తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా..
ఎదుటే.. ఎపుడూ తిరిగే వెలుగా..
ఇదిగో..ఇపుడే..చూసా సరిగా..
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా..
అయితే నాకీనాడే పొద్దుజాడ తెలిసింద కొత్తగా !
No comments:
Post a Comment