November 12, 2008

గీతాంజలి (1989)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా ..మౌనమైన వేళలా !

ఆమనీ పాడవే హాయిగా.. ఆమనీ పాడవే హాయిగా..

వయస్సులో వసంతమే .. ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే .. రచించెలే మరీచికా
పదాల నా ఎదా .. స్వరాల సంపదా
తరాల నా కధా .. క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేననీ !

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూల రాగాలతో

శుకాలతో పికాలతో .. ధ్వనించినా మధూదయం
దివీ భువీ కలా నిజం .. స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే .. మరింత చేరువై
నివాళి కోరినా .. ఉగాది వేళలో
గతించిపోని గాధ నేననీ !

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా ..మౌనమైన వేళలా !

ఆమనీ పాడవే హాయిగా.. ఆమనీ పాడవే హాయిగా..

*************************************

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర

ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలూ .. రాలు పూల దండలు
నీదో లోకం .. నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలూ .. మాసిపోవు ఆశలూ
నింగీ నేల .. తాకే వేళ
నీవే నేనై పోయేవేళాయె
నేడు కాదులే .. రేపు లేదులే
వీడుకోలిదే .. వీడుకోలిదే !

నిప్పులోన కాలదూ .. నీటిలోన నానదూ
గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ
రాచవీటి కన్నెదీ .. రంగు రంగు స్వప్నమూ
పేదవాడి కంటిలో పేద రక్తమూ

గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా .. ఎదురులేదు ప్రేమకూ
రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికీ .. కృష్ణ రాసలీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవీ
ఆ అనారు ఆశకీ .. తాజ్ మహలు శోభకీ
పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ

నిధి కన్న ఎద మిన్న .. గెలిపించు ప్రేమనే
కధ కాదు బ్రతుకంటె .. బలికానీ ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా .. ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే .. తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసీ ..తీర్చమందిలే కసీ
నింగీ నేల .. తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన

లేదు శాసనం .. లేదు బంధనం
ప్రేమకే జయం .. ప్రేమదే జయం !

No comments: