November 03, 2008

సీతాకోకచిలుక (1981)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి

గానం: బాలు, ఎస్.పి.శైలజ

ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ !

మాటే మంత్రమూ
మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పూవూ తావిగా
సం యోగాల సంగీతాలు విరిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ..మనసే బంధమూ

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ

ఇది కళ్యాణం కమనీయం జీవితం

*******************************

గానం: ఇళయరాజా, వాణీ జయరాం

స గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమమా పపపా గమప గమగసా
నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మామ గాగ సాస నీస

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ ఒరిసీ మురిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో

తనన ననన ననన ననన తనన ననన నాన
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
తనన ననన ననన ననన తనన ననన నాన

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ..ఆ..ఆ..ఆ

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీజడలో గులాబి కని మల్లెల రవ్వడి అలిగే

నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా
నా పుత్తడి బొమ్మా !

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే !


***********************************

గానం: బాలు, పి.సుశీల

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో.. ఇలలో..
కలలో ఇలలో దొరకని కలయిక

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే

కన్యాకుమరి నీ పదములు నేనే
ఆ..ఆ..ఆ..ఆ
కన్యాకుమరి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారీ నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళా

అలిగిన నా తొలి అలకలు
నీలొ పులకలు రేపీ పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళా

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే

భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళా

పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళా

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
సాగర సంగమమే !


**********************************************

గానం: బాలు, వాణీ జయరాం

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచె

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాలా
ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కా నవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాలా

మొగ్గ తుంచుకుంటె మొగమాటాలా
బుగ్గ దాచుకుంటె బులపాటాలా
దప్పికంటె తీర్చటానికిన్ని తంటాలా

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వె గోరింకా
తోడుగుండిపోవె కంటి నీరింకా
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేరులే ఇంకా

మిన్నేటి సూరీడు .. ల ల ల లా
మిన్నేటి సూరీడు .. ల ల ల లా

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచె

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

No comments: