సంగీతం : వి.కుమార్
సాహిత్యం: రాజశ్రీ
గానం: రామకృష్ణ, పి.సుశీల
మధువొలకబోసే .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ (2)
అడగకనే .. ఇచ్చినచో .. అది మనసుకందమూ
అనుమతినే .. కోరకనే .. నిండేవు హృదయమూ
తలవకనే .. కలిగినచో .. అది ప్రేమబంధమూ
బహుమతిగా .. దోచితివీ .. నాలోని సర్వమూ
మనసు మనసుతో ఊసులాడనీ
మూగభాషలో బాస చేయనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ
మధువొలకబోసే .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ
గగమముతో .. ఆ భ్రమరం .. తెలిపినది ఏమనీ
జగమునకూ .. మన చెలిమీ .. ఆదర్శమౌననీ
కలలు తీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ
మధువొలకబోసే .. హా .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ
No comments:
Post a Comment