November 13, 2008

గుప్పెడు మనసు (1979)

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: బాలమురళీ కృష్ణ

మౌనమే నీ భాష ఓ మూగ మనసా

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా..తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా..మాయల దెయ్యానివే
లేనిది కోరేవు..ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

*************************************

గానం : బాలు

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా .. నువ్వేనా (2)

ఆ ... నిన్నేనా అది నేనేనా
కల గన్నానా కనుగొన్నానా (2)

అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా .. నువ్వేనా


ఆ ... కళ్ళేనా
కళ్ళేనా హరివిల్లేనా
అది చూపేనా విరితూపేనా (2)

తుళ్ళి తుళ్ళి పడు వయసేనా
నను తొందర వందర చేసేనా
తుళ్ళి తుళ్ళి పడు వయసేనా
నను తొందర వందర చేసేనా

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా .. నువ్వేనా

ఆ ... నువ్వైనా నీ నీడైనా ఏ నాడైనా నా తోడౌనా
నువ్వైనా నీ నీడైనా ఏ నాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా .. నువ్వేనా

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా !

***************************************

గానం: బాలు, వాణీ జయరాం

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నీ వదనం భూపాలమూ .. నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ .. నువ్వు పాడిందే సంగీతమూ

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

ఇల్లే సంగీతమూ .. వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం .. ఇంకా వింటారా నా గానం (2)

ఊగే ఉయ్యాలకూ .. నువు పాడే జంపాలకూ
ఊగే ఉయ్యాలకూ .. నువు పాడే జంపాలకూ
సరితూగదు ఏ గానమూ .. నీకు ఎందుకు సందేహమూ

నీకు ఎందుకు సందేహము !

ఉడకని అన్నానికీ .. మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో .. చెప్పే త్యాగయ్య మీరేగా (2)

కుత కుత వరి అన్నం .. తై తక తక మను నాట్యం
ఏ భరతుడు రాసిందీ .. నీకా పదునెటు తెలిసిందీ

నీకా పదునెటు తెలిసింది !

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నీ వదనం భూపాలమూ .. నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ .. నువు పాడిందే సంగీతమూ

1 comment:

వేణూశ్రీకాంత్ said...

వేణు గారు మీ బ్లాగ్ చూడగానె ప్రాణం లేచొచ్చిందండీ... ఒక్క సారి telugu song lyrics community లో missing songs అనే thread చూడరా. మీరు పోస్ట్ చేసిన పాటలన్నీ డిలీట్ అయ్యాయి. Send a note to my email venusrikanth@gmail.com or scrap me in my orkut. We badly need your help.