March 27, 2013

Back Bench Student (2013)


సంగీతం : సునీల్ కాశ్యప్
గానం : ప్రణవి, సునీల్ కాశ్యప్, దినకర్
సాహిత్యం : సిరా శ్రీ, లక్ష్మి భూపాల్

ఓ .. తెలిసి తెలిసి తెలిసీ నీవల్లే
మనసు మనసు కలిసే నీవల్లే
ఇంతలోనె ఈ వింత ఏమిటిలా !

చినుకు చినుకు జడిలో నీవల్లే
తడిసి తడిసి మురిసా నీవల్లే
నన్ను నేను మరిచానె ఎందుకిలా !!

ఓ.. నీవల్లనే నా నా నాలోన తపనా
నీ గుండెలోనా నా నా నేనుండి పోనా న న లలనా

తెలిసి తెలిసి తెలిసీ నీవల్లే
మనసు మనసు కలిసే నీవల్లే
ఇంతలోనె ఈ వింత ఏమిటిలా !!!

పగలే వెన్నెల నీవల్లే
రాత్రైతే ఎండలు నీవల్లే
భూమి గాల్లో తిరిగెను నీవల్లే
ఈ వింతలు నీవల్లే

ఒంటరి నావలు నీవల్లే
ఈ తుంటరి ఊహలు నీవల్లే
శూన్యం నిండెను నీవల్లే
ఆనందం నీవల్లే

ప్రేమైనా నీవల్లే... పిచ్చైనా నీవల్లే !

తెలిసి తెలిసి తెలిసీ నీవల్లే
మనసు మనసు కలిసే నీవల్లే
ఇంతలోనె ఈ వింత ఏమిటిలా !

గంధపు గాలులు నీవల్లే
గాడంగా విరహం నీవల్లే
రంగుల కలలు నీవల్లే
రారాణిని నీవల్లే

అలలకు సుడులూ నీవల్లే
మేఘాలకి మెరుపులు నీవల్లే
ఈ ఇంద్ర ధనసులు నీవల్లే
ఉల్లాసం నీవల్లే

నీవల్లే..నీవల్లే ఈ మాయే నీవల్లే !

తెలిసి తెలిసి తెలిసీ నీవల్లే
మనసు మనసు కలిసే నీవల్లే
ఇంతలోనె ఈ వింత ఏమిటిలా !

ఓ.. నీవల్లనే నా నా నాలోన తపనా
నీ గుండెలోనా నా నా నేనుండి పోనా న న లలనా

తెలిసి తెలిసి తెలిసీ నీవల్లే
మనసు మనసు కలిసే నీవల్లే
ఇంతలోనె ఈ వింత ఏమిటిలా !!