సంగీతం : సునీల్ కాశ్యప్
సాహిత్యం : సిరాశ్రీ
గానం : కారుణ్య , చైత్ర
తడి పెదవులే కలిసి ఒకటైనవే
కను రెప్పలే మూసి మైమరచేనే
నా ప్రాణాలు అన్నీతోడేసి నిలో కలిపెయ్
శత జన్మాల బిగి కౌగిట్లో నన్నే నిలిపేయ్
తడి పెదవులే కలిసి ఒకటైనవే
కను రెప్పలే మూసి మైమరచేనే
కనుల వెలుగే నే కావాలని
అణువు అణువు నీలో కలవాలని
కడదాక నీతో సాగాలని
కనుపాప నై నే నిలవాలని
నా ప్రాణాలు అన్నీతోడేసి నిలో కలిపెయ్
శత జన్మాల బిగి కౌగిట్లో నన్నే నిలిపేయ్
ఎదకు సడివై నీవు ఉండాలని
నిను ఎపుడు నేనే అందాలని
నుదుట ఎరుపై నీవూ నిండాలని
ప్రతి జన్మ లోనూ పొందాలని
నా ప్రాణాలు అన్నీతోడేసి నిలో కలిపెయ్
శత జన్మాల బిగి కౌగిట్లో నన్నే నిలిపేయ్
**************************************
సంగీతం : సునీల్ కాశ్యప్
సాహిత్యం : సిరాశ్రీ
గానం : దినకర్ , చైత్ర
నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమై పోయెందుకే
నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి
ఇది ప్రేమా అనుకుంటూ అడుగేసానా నేనేనా ?
నిను నేనే ఏవేవో అడిగేసానా నిజమేనా ?
నీ నీడలో నేనుండగా నీ అడుగుల వెంటే నేనే కదా
నీ చూపులే నా మనసుని ఆ అడిగేవన్నీ నిజమే కదా
కదిలేనా నీ తలపు లేకుండానే క్షణమైనా
నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
కనుతెరిచి ఏదేదో చూస్తూ ఉన్న కనబడదే
కనులెదుట నీ రూపే కదులుతూ ఉంది కలకాదే
నీ లోకమై నేనుండగా నీ చూపుల నిండా నేనే కదా
నా ఊపిరై నువ్వుండగా నా ఈ ప్రాణం నీదే కదా
కడదాకా ఒక్కటై నిలవాలి ఏమైనా
నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమై పోయెందుకే
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి
**********************************
సంగీతం : సునీల్ కాశ్యప్
సాహిత్యం : సిరాశ్రీ
గానం : ప్రణవి
నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే
ఏదేదో తెలిపే ఈ ముగ మనసే
కవ్వించెనే భలే ఇది వింత కనుకే
కలయిక కలే ఆ కల ఇక నిజమాయేనా
కలవరమంతా ఓ వరమయి రుజువాయేనా
గడియారమైనా కరుణించి కాలాన్ని కాసేపు ఆపి చూపే వీలుందా
ప్రియ రాగమేదొ నీలోనే కదలాడి ఈనాడే కొత్త భావం రేపేనా .... అ అ అ
నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే
తెలియని మౌనం ఈ నడకకు తడబాటేనా
తలవని భారం ఈ మనసుకి సుఖమాయేనా
గడి దాటగానే ఏవేవో భావాలే ఏదేదో చేసి బందీ చేసేనా
చేయి తాకగానే ని మనసే నిను తట్టి తియంమ్మాయింక అంది నిన్నేనా
నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే
This entry was posted
on October 22, 2011
at Saturday, October 22, 2011
and is filed under
2011
. You can follow any responses to this entry through the
comments feed
.
