August 30, 2010

1940 లో ఒక గ్రామం

సంగీతం: సాకేత్ సాయిరాం
సాహిత్యం: శ్రీకాంత్ అప్పలరాజు
గానం: అనిల్ కుమార్

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా

ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటా
ఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటా
ఏనాడైనా .. ఏ వేళైనా .. నాలోనా
ఏదేమైనా .. ఎవరేమైనా .. నీవేనే

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా !

ఈ వేళ ఎక్కడ ఉన్నావో .. ఏమేమి చేస్తూ ఉన్నావో
నాకేమో మదిలో నీ ధ్యాసే .. నీవేమో ఎపుడూ నా శ్వాసే
కాసంత కుదురే లేదాయే .. రేయంత నిదురే రాదాయే
నువు లేక కనులలో నీరేలే .. నువు రాక నిమిషం యుగమేలే
ఏ మాట విన్నా నీ పిలుపే .. యే చోట ఉన్నా నీ తలపే
విడలేను లే .. విడిపోనులే .. కడదాక నాతో నీవేలే

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా !!

నా కలల వెన్నెల నీవేనే .. నీ కనుల చీకటి కనలేనే
నా మనసు మాటే వినదేమో .. ఈ వలపు మాయే విడదేమో
నేనేమొ చేపగ మారానే .. నీవేమొ నీరై పోయావే
ఓ క్షణము విడి వడి పోయామా.. ప్రాణాలు విలవిల లాడేనే
నీ పేరు మరువను క్షణమైనా .. నీ ప్రేమ విడువను కలనైనా
కను మూసినా .. కను తెరచినా .. నగుమోమే పిలుచును ఏ వేళా

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా !!!

3 comments:

Hari Gottipati said...

Thanks Venu.

భాస్కర రామిరెడ్డి said...

Venu గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

హారం

Unknown said...

Sir I'm also using this Blog template in my blog..But my comments button is not working..Then how to enable it..pls tell to me.. its my request.