August 04, 2009

గోపి గోపిక గోదావరి


Get this widget Track details eSnips Social DNA


సంగీతం : చక్రీ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : చక్రీ , కౌసల్యా


నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నైలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగలుస జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరఫున గీత చెరపనా
ఎంత దూరాన నీవున్నా నితోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుందీ వేళ
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల

No comments: