May 25, 2009

ఆ ఒక్కడు




సంగీతం : మణిశర్మ
గానం : Dr.నారాయణ
సాహిత్యం : వేదవ్యాస్


రాధామానస రాగ సుగంధ కృష్ణ గోవిందా
గోపీ యవ్వన పుష్ప మిళిందా లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళీ రసకందా
రారా గోకుల నంద ముకుందా రారా కరివరదా

రాధామానస రాగ సుగంధ కృష్ణ గోవిందా
గోపీ యవ్వన పుష్ప మిళిందా లీలా మకరందా

మంచిని పెంచే మధుమయ హృదయా
వంచన తుంచే వరగుణ వలయా
మమతను పంచే సమతా నిలయా
భక్తిని ఎంచే బహుజన విజయా
మాయా ప్రభవా మాధవ దేవా
మహిమా విభవా మధుభావా
శ్రీ కృష్ణా మా తృష్ణా నీ పైనా

రాధామానస రాగ సుగంధ కృష్ణ గోవిందా
గోపీ యవ్వన పుష్ప మిళిందా లీలా మకరందా

ధర్మము తరిగి నలిగిన వేళ
చెరలో చేరిన ఓ యదువీరా
కళగా సాగే కరుణా ధారా
వరమై వెలిగే వరమందారా
పదములు చూపే పరమోద్దారా
భారము నీదే భాగ్యకరా
శ్రీ కృష్ణా మా తృష్ణా నీ పైనా

రాధామానస రాగ సుగంధ కృష్ణ గోవిందా
గోపీ యవ్వన పుష్ప మిళిందా లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళీ రసకందా
రారా గోకుల నంద ముకుందా రారా కరివరదా


************************************************

గానం : విజయ్ ఏసుదాస్
సాహిత్యం : అనంత్ శ్రీరామ్


ఊరుకో మనసా ఊరుకోవమ్మా
కనులు కందేలా కుములిపోకమ్మా
నిరాశంటే నీటి రాతా ఎంత సేపు నిలువగలదే
నిరూపించే వేళ రాదా అంతలోపు ఓర్చుకోవే
నీవు చేసే మంచి నిన్ను కాచేనే

ఊరుకో మనసా ఊరుకోవమ్మా
కనులు కందేలా కుములిపోకమ్మా

ఉరుములే మోగే లోపుగా
మెరుపులే సాగే తీరుగా
తపనలే ఆపే లోపుగా
తలపులే తీరం చేర్చవా
కాలమే నీ కాలి బాటై వేచేనే

ఊరుకో మనసా ఊరుకోవమ్మా
కనులు కందేలా కుములిపోకమ్మా

అలసటే రాని ఆశతో
గెలుపుకై మార్గం వేసుకో
అవధులే లేని ఊహతో
అందనీ శిఖరం అందుకో
చేతనంతో చేతి గీత మారేనే

ఊరుకో మనసా ఊరుకోవమ్మా
కనులు కందేలా కుములిపోకమ్మా

No comments: