November 12, 2008

గీతాంజలి (1989)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా ..మౌనమైన వేళలా !

ఆమనీ పాడవే హాయిగా.. ఆమనీ పాడవే హాయిగా..

వయస్సులో వసంతమే .. ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే .. రచించెలే మరీచికా
పదాల నా ఎదా .. స్వరాల సంపదా
తరాల నా కధా .. క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేననీ !

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూల రాగాలతో

శుకాలతో పికాలతో .. ధ్వనించినా మధూదయం
దివీ భువీ కలా నిజం .. స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే .. మరింత చేరువై
నివాళి కోరినా .. ఉగాది వేళలో
గతించిపోని గాధ నేననీ !

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా ..మౌనమైన వేళలా !

ఆమనీ పాడవే హాయిగా.. ఆమనీ పాడవే హాయిగా..

*************************************

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర

ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలూ .. రాలు పూల దండలు
నీదో లోకం .. నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలూ .. మాసిపోవు ఆశలూ
నింగీ నేల .. తాకే వేళ
నీవే నేనై పోయేవేళాయె
నేడు కాదులే .. రేపు లేదులే
వీడుకోలిదే .. వీడుకోలిదే !

నిప్పులోన కాలదూ .. నీటిలోన నానదూ
గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ
రాచవీటి కన్నెదీ .. రంగు రంగు స్వప్నమూ
పేదవాడి కంటిలో పేద రక్తమూ

గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా .. ఎదురులేదు ప్రేమకూ
రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికీ .. కృష్ణ రాసలీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవీ
ఆ అనారు ఆశకీ .. తాజ్ మహలు శోభకీ
పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ

నిధి కన్న ఎద మిన్న .. గెలిపించు ప్రేమనే
కధ కాదు బ్రతుకంటె .. బలికానీ ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా .. ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే .. తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసీ ..తీర్చమందిలే కసీ
నింగీ నేల .. తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన

లేదు శాసనం .. లేదు బంధనం
ప్రేమకే జయం .. ప్రేమదే జయం !

రెండు రెళ్ళు ఆరు (1986)

సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి

కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే.. ముద్దర వేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్తతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో

చిరుగాలి దరఖాస్తు .. లేకుంటె కరిమబ్బు
చిరుగాలి దరఖాస్తూ .. లేకుంటె కరిమబ్బూ
మెరుపంత నవ్వునా .. చినుకైన రాలునా

జడివాన దరఖాస్తు .. పడకుంటె సెలయేరు
జడివాన దరఖాస్తూ .. పడకుంటె సెలయేరూ
వరదల్లె పొంగునా..కడలింట చేరునా

శుభమస్తు అంటే .. దరఖాస్తు ఓకే !

ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో

చలిగాలి దరఖాస్తు .. తొలిఈడు వినకుంటె
చలిగాలి దరఖాస్తూ .. తొలిఈడు వినకుంటే
చెలి జంట చేరునా .. చెలిమల్లె మారునా

నెలవంక దరఖాస్తు .. లేకుంటె చెక్కిళ్ళు
నెలవంక దరఖాస్తూ .. లేకుంటె చెక్కిళ్ళూ
ఎరుపెక్కి పోవునా .. ఎన్నెల్లు పండునా

దరిచేరి కూడా దరఖాస్తులేలా !

కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్తతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో !

November 10, 2008

మహాకవి క్షేత్రయ్య (1976)

సంగీతం: ఆదినారాయణరావు

గానం: రామకృష్ణ, పి.సుశీల

జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో
నాకెంత సిగ్గాయె బావా బావా నను వీడలేవా

పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో
నీకింత సిగ్గేల బాలా రావా నను చేరరావా

ఆ .. ఆ .. ఆకాశమార్గాన అందాల మేఘాలు పెనవేసుకున్నాయి చూడూ
చిగురాకు సరదాలు చిరుగాలి సరసాలు గిలిగింతలాయేను నేడూ
అందచందాలతో .. ప్రేమ బంధాలతో .. జీవితం హాయిగా సాగనీ !
బాలా రావా నను చేరరావా

ఆ .. ఆ .. ఆ .. ఆకొమ్మపై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పాడేనూ
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద మైమరచి కలలందు కరిగేనూ
ముద్దు మురిపాలతో .. భావరాగాలతో .. యవ్వనం పువ్వులా నవ్వనీ !
బావా బావా నను వీడలేవా

ఆ .. ఆ .. బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు కొనగోటి మీటులే కోరేనూ
నీ లేత అధరాలు ఎంతెంతొ మధురాలు .. ఈ నాడు నా సొంతమాయేనూ
దేవి దీవించెను .. స్వామి వరమిచ్చెను .. ఇద్దరం ఏకమౌదాములే !
బాలా రావా నను చేరరావా

జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో
నాకెంత సిగ్గాయె బావా బావా నను వీడలేవా

పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో
నీకింత సిగ్గేల బాలా రావా నను చేరరావా

అల్లరిబుల్లోడు (1978)

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల

చుక్కల తోటలో ఎక్కడున్నావో .. పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .. నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ

నీలి నీలి నీ కురులా .. నీలాల మేఘాల .. విరిసింది మల్లికా నా రాగ మాలికా
అల్లిబిల్లి నీ కౌగిట .. అల్లుకున్న నీ మమతా .. కొసరింది కోరికా అనురాగ గీతికా

నీ మూగ చూపులలో .. చెలరేగే పిలుపులలో
నీ పట్టువిడుపులలో .. సుడి రేగే వలపులలో
కన్నూ కన్నూ కలవాలీ కలిసి వెన్నెలై పోవాలీ
చీకటి వెన్నెల నీడలలో దాగుడుమూతలు ఆడాలీ !

చుక్కల తోటలో ఎక్కడున్నావో .. పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .. నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ

ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచిఉన్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో

ఈ పూల వానలలో .. తడిసిన నీ అందాలూ
ఆ.. ఆ.. ఈ పూట సొగసులలో .. కురిసిన మకరందాలూ
నీలో తీగలు మీటాలీ నాలో రాగం పలకాలీ
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలీ !

చుక్కల తోటలో ఎక్కడున్నావో .. పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .. నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ

November 07, 2008

కన్నవారి కలలు (1974)

సంగీతం : వి.కుమార్
సాహిత్యం: రాజశ్రీ
గానం: రామకృష్ణ, పి.సుశీల

మధువొలకబోసే .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ (2)

అడగకనే .. ఇచ్చినచో .. అది మనసుకందమూ
అనుమతినే .. కోరకనే .. నిండేవు హృదయమూ
తలవకనే .. కలిగినచో .. అది ప్రేమబంధమూ
బహుమతిగా .. దోచితివీ .. నాలోని సర్వమూ

మనసు మనసుతో ఊసులాడనీ
మూగభాషలో బాస చేయనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

గగమముతో .. ఆ భ్రమరం .. తెలిపినది ఏమనీ
జగమునకూ .. మన చెలిమీ .. ఆదర్శమౌననీ
కలలు తీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే .. హా .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ