October 24, 2011

మొగుడు

సంగీతం: బాబూ శంకర్

సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్




చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా
ఇప్పుడే .. ఇక్కడే .. వింతగా .. కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని .. ఇన్నాళ్ళూ నాకే తెలియని
నన్నూ .. నేనే .. నీలో

చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా !

పచ్చని .. మాగాణి చేలూ పట్టు చీరగా కట్టీ
బంగరు .. ఉదయాల సిరులూ నొసత బాసికంగా చుట్టీ
ముంగిట .. సంక్రాతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్దీ
పున్నమి .. పదహారు కళలూ సిగలో పువ్వులుగా పెట్టి

దేవేరిగా .. పాదం పెడతానంటూ  
నాకూ .. శ్రీవారిగా .. పట్టం కడతానంటూ

నవనిధులూ వధువై వస్తుంటే
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నేనైనట్టూ..

చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా !!

నువ్వూ .. సేవిస్తుంటే నేను సార్వభౌముడైపోతానూ
నువ్వూ .. తోడై ఉంటే సాగరాలు దాటేస్తానూ
నీ .. సౌందర్యంతో ఇంద్రపదవినెదిరిస్తానూ
నీ .. సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటానూ

ఏళ్ళే వచ్చీ .. వయసును మళ్ళిస్తుంటే
నేనే .. నీ వళ్ళో పాపగ చిగురిస్తుంటే

చూస్తున్నా...ఆ ఆ ఆ

చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా
ఇప్పుడే .. ఇక్కడే .. వింతగా .. కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని .. ఇన్నాళ్ళూ నాకే తెలియని
నన్నూ .. నేనే .. నీలో

చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా !!!




*********************************************

సంగీతం: బాబూ శంకర్

సాహిత్యం: సిరివెన్నెల
గానం: మధుమిత













కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఇతే చాలదు మొగుడివి కుడా కావాలి
మొగలిపువ్వులా  వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమి మిగలని నిరుపేదవి ఐపోవాలి
వచ్చే జన్మకి  కూడా నువ్వే కావాలి


కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి


ఇంట్లో ఉంటే  కొంగు వదలవని
ఇంట్లో ఉంటే  కొంగు వదలవని
తిట్టే విరసం రావాలి
గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి
నిద్దట్లో నువ్వు కలవరించినా అది నా పేరే కావాలి
ఆవునో కాదో అనుమానంతో నే మేలుకునే  వుండాలి
నేనే లేని   ఒక్క క్షణం బ్రతకలేను అనుకోవాలి
అందుకనే వందేళ్ళపాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి


కావాలీ.........
కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి


చీకటినైనా  చుడనివ్వనని 
చీకటినైనా  చుడనివ్వనని చీరై నన్ను చుట్టేయ్యాలి 
చెప్పకూడని ఉసులు చెప్పే రెప్పల సడి వినగలగాలి 
నాలో తెగువను పెంచేలా నువ్వు కొంచెం లోకువ కావాలి
నేను రేచ్చిపోతుంటే ఎంతో అణకువగా ఓదిగుండాలి 


నువ్వంటూ ఎం లేనట్టు  నాలో కరిగిపోవాలి 
చెట్టంత నువ్వే చిట్టి  బొమ్మవయి కొత్త కోత్త కధ రావాలి


కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఇతే చాలదు మొగుడివి కూడా కావాలి
మొగలిపువ్వులా  వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమి మిగలని నిరుపేదవి ఐపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి

No comments: