March 13, 2012

ఇష్క్





 గానం: ప్రదీప్ విజయ్, కళ్యాణి నాయర్ 
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


నిన్నకీ .. నేటికీ .. ఎంతగా .. మారెనో 
నిన్నలో .. ఊహలే .. ఆశలై .. చేరెనో 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


అడుగడుగున నిన్ను కంటున్నా 
అణువణువున నిన్ను వింటున్నా 
క్షణమునకొక జన్మ చూస్తున్నా 
చివరకి నేనే నువ్వు అవుతున్నా 


ఎందుకో .. ఈ తీరుగా మారటం 
ఏమిటో .. అన్నింటికీ కారణం 


బదులు తెలుసుంది ప్రశ్న అడిగేందుకే ! 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


లోలో ఉన్న ఊసు గుండె పైకెళ్ళి 
గుండెల్లోన ఊహ కళ్లపై తేలి 
కళ్ళల్లోన ఆశ నవ్వుపై వాలి 
నవ్వులోన తలదాల్చుకుంటుందీ 


అక్కడే .. ఆగింది ఆ భావనా 
దాటితే .. ఏమౌనో ఏమో అనా 


ఎందుకాలస్యమొక్కమాటే కదా ! 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


నిన్నకీ .. నేటికీ .. ఎంతగా .. మారెనో 
నిన్నలో .. ఊహలే .. ఆశలై .. చేరెనో

No comments: