సంగీతం : సెల్వ గణేష్
సాహిత్యం : కృష్ణ చైతన్య
గానం : కార్తిక్ , చిన్మయి
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కోన ఊపిరి తో ఉన్నా ప్రాణంపొయ్యావే
నా మనసే నన్నే వదిలి వెళుతుందే నీతో ఎటు వైపో
ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవర పెడుతోందే
తడబడి తడబడి రా తేనే పలుకై రా
కనపడి కలబడినా ప్రేమే ముడిపడునా
మధురం మధురం మధురం ఈ పరువం మధురం
ఊపిరి ఆడదా నీకు .....ఎదురు నువ్వైతే
నేన్నేం చేశా నేరం ....ప్రాణం తీయకే
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపెసావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే
నీ కోసమా ?
మధురం మధురం పరువం
నా మనసే నన్నే వదిలి వెళుతుందే నీతో ఎటు వైపో ఎటు వైపో
అలా ఇలా సరాసరి అందే మరి నా మనసెందుకో
గడసరి మగసిరి నిన్ను కోరింది
సొగసరి ఎదమరి తీరే మారింది
గుప్పెడు మనసే అలా ఎలా కొట్టేసావే
కనికట్టేదో కధాకళి కట్టిస్తుందే
మరువం మరువం పరువం చేసే గాయాలు
ఊపిరి ఆడదు నాకు..... ఎదురు నే రానా
కోన ఊపిరి తో ఉన్నా... ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపెసావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే
నా కోసమే
చినుకునై చిలిపిగా నిన్ను తడిమేయ్యనా
గోడుగునై సోగాసుపై నిన్ను ఆపెయ్యనా
వయసోక నరకం వాంఛలై వేధిస్తుంటే
తియ్యని తమకం అమ్మో భయం ఎం చేస్తుందో
మరువం మరువం పరువం చేసే గాయాలు
ఊపిరి ఆడదు నాకు..... ఎదురు నే రానా
కోన ఊపిరి తో ఉన్నా ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపెసావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే
నా కోసమే ...నీ కోసమే
మధురం మధురం పరువం
No comments:
Post a Comment