July 28, 2009

జోష్



Powered by eSnips.com


సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్


నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నెప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీలీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా


నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు చిత్రంగా
నీవైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు నీలాగా
నలువైపులా
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి


నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నువ్వేం చూస్తున్నాఎంతో వింతల్లే అన్నీ గమనించే
ఆశ్చర్యమా
యే పనిచేస్తున్నా ఎదో ఘనకార్యం లాగే గర్వించే
పసిప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా
చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల


నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నిన్నెప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీలీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


****************************************************

సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రాహుల్ వైధ్య , ఉజ్జయని ముఖర్జీ


ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం
కనకే అపురూపం ......కలిగే అనురాగం
ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం
కనకే అపురూపం ......కలిగే అనురాగం


ఎదలోనే కొలువున్నా ఎదురైనా పోల్చలేక
నిజమేలే అనుకున్నా ఋజువేది తేల్చలేక
మరెలా .......ఆ ఆ ఆ ఆ


ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం


దారి అడగక పాదం నడుస్తున్నదా
వేళ తెలుపక కాలం గడుస్తున్నదా
తడి ఉన్నదా ఎదలో తడిమి చూసుకో
చెలిమిగ అడిగితే చెలి చెంత చిలిపిగ పలకదా వయసంతా
జతపడు వలపుల గుడిగంట తలపుల తలుపులు తడుతుందా
చూస్తూనే పసికూన ఎదిగిందా ఇంతలోన
చెబితేనే ఇపుడైనా తెలిసిందా ఈ క్షణాన
అవునా ...ఆ ఆ ఆ ఆ ఆ


ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం


కళ్ళు నువ్వొస్తుంటే మెరుస్తున్నవి
వెళ్ళివస్తానంటే కురుస్తున్నవి
కొన్నాళ్ళుగా నాలో ఇన్ని వింతలు ఓహో
గలగల కబురులు చెబుతున్నా వదలదు గుబులుగ ఘడియైనా
మది అనవలసినదేదైనా పెదవుల వెనకనె అణిగేనా
హృదయం లో వింత భావం పదమేదీ లేని కావ్యం
ప్రణయం లో ప్రియ నాదం వింటూనే ఉంది ప్రాణం
తెలుసా ...ఆ ఆ ఆ ఆ

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం

2 comments:

Unknown said...

Cool !

First song baagaa nacchesindi naaku. So sweet !

:)

Siri said...

yes bujji naaku chaala nacchindi :) kalavaramaye madilo songs koodaa baagaa nacchaayi esp hariharan voice ;)