July 30, 2009

కలవరమాయే మదిలో



Powered by eSnips.com



సంగీతం : శరత్ వాసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : చిత్ర



కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో..... కలవరమాయే మదిలో

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే

మనసునే తొలి మధురిమలే వరి౦చెనా
బతుకులో ఇలా సరిగమలే రచి౦చెనా
స్వరములేని గాన౦ మరపు రాని వైన౦
మౌనవీణ మీటుతు౦టే..... కలవరమాయే మదిలో

ఎదగని కలే ఎదలయలో వరాలుగా
తెలుపని అదే తపనలనే తరాలుగా
నిదురపోని తీర౦ మధురమైన భార౦
గు౦డెనూయలూపుతు౦టే .....కలవరమాయే మదిలో

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో..... కలవరమాయే మదిలో




************************************************************************


సంగీతం : శరత్ వాసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : చిత్ర


జినక్కి తయ్యా జినక్కి తయ్యా జినక్కి తయ్యరే
జినక్కి తయ్యా జినక్కి తయ్యా జినక్కి తయ్యరే


తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా
దరి చేరే స్వరము నాకు వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా


కొమ్మ చాటుగా పల్లవించు ఆ గండు కోయిలమ్మ
గొంతులోని నా తేనెపట్టునే తాను కోరేనమ్మా
పరుగాపని వాగులలోనా కదిలే అలలే
నా పలుకుల గమకం ముందు తల వంచెనులే
ఎగిసే ....తేనె రాగాలు నీలిమేఘాలు తాకితే చాలు నింగి లోగిళ్ళు
జల్లై విల్లై తుళ్ళు

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా

ప ప స స ద స స ద ప ప ప ప గ స ని ప గ రి
స స ద ద ప ద ద ప గ ప స గ ప రి
ప ద ని స గ రి గ రి గ రి గ రి
ప ద ని స రి గ రి గ రి గ రి గ
ప ద ని స గ గ ప ద ని స గ గ ప ద ని స గ

ఇన్ని నాళ్ళుగా కంటి పాపలా పెంచుకున్న స్వప్నం
నన్ను చేరగా సత్యమవ్వదా నమ్ముకున్న గానం
పెదవంచున సంగతులన్నీ శ్రుతులై లయలై
ఎదనూపిన ఊపిరులవని స్వర సంపదలై
బతుకే .....పాటలా మారు బాటలో సాగు ఆశలే తీరు రోజులే
చేరువయ్యే లైఫే హాయే


తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా
దరి చేరే స్వరము నాకు వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా

**********************************************************************************************

సంగీతం : శరత్ వాసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : చిత్ర , రోషన్


నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా మీతి మీరి పోయేనా అంతా ఒకటే నటన
నా ప్రేమ సంతకాల సాక్షాలే చూపనా
ఏం మాయ చేసినా నీ మాటే చెల్లునా
నాపై కోపాలేనా


నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా మీతి మీరి పోయేనా అంతా ఒకటే నటన


నీకు నేనే చాలనా నిన్ను కోరి వస్తే చులకనా
కాలు దువ్వే కాంచన కంటి పాప లో నిను దాచనా
ఆ కన్నులే పలు అందాలనే చూస్తే ఎలా
ఏం చూసినా ఎదలో ఉందిగా నిదా కల
నమ్మేదెలా.......ఆ ఆ ఆ ఆ


నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా


నీడలాగా సాగనా గుండె నీకు రాసిచ్చెయ్యనా
మాటలేమో తియ్యన మనసులోని ఆశే తీర్చునా
నీ కోసమే నన్ను ఇన్నాళ్ళుగా దాచానిలా
ఏమో మరి నిను చూస్తే మరి అలా అనిపించలా
నీతో ఎలా .......ఆ ఆ ఆ ఆ


నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా మీతి మీరి పోయేనా అంతా ఒకటే నటన
నా ప్రేమ సంతకాల సాక్షాలే చూపనా
ఏం మాయ చేసినా నీ మాటే చెల్లునా
నాపై కోపాలేనా


నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా మీతి మీరి పోయేనా అంతా ఒకటే నటన

************************************************************************


సంగీతం : శరత్ వాసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : హరిహరన్ , కల్పన


ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని...పోల్చానే నాదో కానీ
నీ వాణ్ణి

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని

మారాము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకెలే
నీ కొంటె కోపాలు చూడాలనే ......దొబూచులాడేను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని

నీ నీడలాగ నీతోనే ఉన్నా నీ జంట నేనవ్వనా
వేరెవ్వరు నా నీ గుండెలోన నా కంట నీరాగునా

ఆ తలపు నా ఊహకే తోచునా..... నా శ్వాస నిను వీడి జీవించునా
నీ కంటి పాపల్లే నేలేనా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని...పోల్చానే నాదో కానీ
నీ వాణ్ణి

No comments: