నువ్వు నాకు గుర్తొస్తే.. ఎవ్వరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప... నువ్వు నా పక్కన ఉంటే అసలు నేనే ఉండను, నువ్వు తప్ప
June 12, 2009
కరెంట్
current
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : సాగర్ ,రానిన
ధీంతర ధీంతర ధిర ధిర ధిరన
ధిర ధిర ధిర ధీంతనన
ధిర ధీంతర ధీంతర ధిర ధిర ధిరన
ధిర ధిర ధిరన
అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు
There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before
నాలోనాకే కొత్తగుందిరో
లావా లాగ మరుగుతోందిరో
లావాదేవీ జరుగుతోందిరో
ఈ తికమక ఏంటిరో
అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు
ధీంతర ధీంతర ధిర ధిర ధిరన
ధిర ధిర ధిర ధీంతనన
ధిర ధీంతర ధీంతర ధిర ధిర ధిరన
ధిర ధిర ధిరన
ప్రపంచమంతా జయించినట్టు ఉప్పొంగిపోతోంది ప్రాణం
పెదాలలోన పదాలు అన్ని క్షణాల లోనే మాయం
శరీరమంతా కరెంటు పుట్టి భరించలేకుంది ప్రాయం
నరాలలోన తుఫాన్ రేగి ఇదేమి ఇంద్రజాలం
There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before
అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు
క్షణలనేమో యుగాలు చేసి తెగేడిపిస్తోంది కాలం
ఎడారిలోన చలేసినట్టు ఇదేమి వింత మైకం
తపస్సులన్నీ ఫలించినట్టు తమాషగుంటోంది వైనం
మనస్సుతోటి మనస్సులోకి రహస్య రాయబారం
There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before
అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు
*************************************************
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నేహ
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే
అపుడు ఇపుడు ఎప్పుడైనా
నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా
గురుతుకు రాదా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే
రంగూ రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా
చుట్టూ శున్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరీ నన్ను మాటాడిస్తోంది
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరపే రావుగా
ఎద మారుమూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నేను లేనే లేను అనుపించావుగా
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఓంటరి చేసావే
ఏకాంత వేళలో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదెలా
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment