February 20, 2009

భక్తకన్నప్ప (1976)

సంగీతం: ఆదినారాయణ రావు-సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: రామకృష్ణ, పి.సుశీల

ఆకాశం దించాలా..నెలవంకా తుంచాలా..సిగలో ఉంచాలా
ఆకాశం దించాలా..నెలవంకా తుంచాలా..సిగలో ఉంచాలా

చెక్కిలి నువ్వూ నొక్కేటప్పటి చక్కిలిగింతలు చాలు
ఆకాశం నా నడుమూ..నెలవంకా నా నుదురూ..సిగలో నువ్వేరా

పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే..తెస్తానే
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే..తీస్తానే

ఆ...పట్టు తేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా

అంతేనా..అంతేనా
అవును..అంతేరా

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా

సూరీడూ ఎర్రదనం సింధూరం చేస్తానే..చేస్తానే
కరిమబ్బూ నల్లదనం కాటుక దిద్దేనే..దిద్దేనే

ఆ..నీ వంటి వెచ్చదనం నన్నేలే సూరీడూ
నీ కంటి చల్లదనం నా నీడ..నా గూడూ

అంతేనా..అంతేనా
అవును..అంతేరా

హహ..మెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలా..తలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా !


*************************************************

సాహిత్యం: ఆరుద్ర
గానం: రామకృష్ణ, పి.సుశీల

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)

అరె సిన్నోడా ..
ఆకుచాటున పిందె ఉందీ .. చెట్టూ సాటున సిన్నాదుందీ
ఓ ఓ ఓ ఆకుచాటున పిందె ఉంది .. చెట్టూ సాటున సిన్నాదుందీ
సక్కని సుక్కని టక్కున ఎతికీ దక్కించుకోరా .. దక్కించుకోరా

దక్కించుకోరా .. దక్కించుకోరా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అరె సిన్నమ్మీ ..
మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఓ ఓ ఓ మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా

మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా

ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
ఓ ఓ ఓ సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా

కొప్పూ లోనీ మొగలీ పువ్వూ గుప్పుమందే .. ఒప్పులకుప్పా
ఓయ్ గుప్పుమందే .. ఒప్పులకుప్పా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
ఓ ఓ ఓ సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని

దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే .. నాకు నువ్వే
నీకు నేనే .. నాకు నువ్వే !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)

No comments: